Liger: ఇండియాను షేక్ చేస్తోన్న లైగర్..!
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘లైగర్’ ట్రైలర్‌ను జూలై 21న అత్యంత గ్రాండ్‌గా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. రిలీజ్ అయిన 24 గంటల్లోనే ఏకంగా 50 మిలియన్‌కు పైగా వ్యూస్‌తో యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.
- Anil Aaleti
- Published On : July 22, 2022 / 08:41 PM IST
Liger Trailer Creates Havoc In 24 Hours
Liger: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘లైగర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాధ్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా కోసం సౌత్ ఆడియెన్స్ తో పాటు నార్త్ ఆడియెన్స్ కూడా ఆృతతగా ఎదురుచూస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులకు ఈ చిత్ర ట్రైలర్ తో కాస్త రిలీఫ్ ఇచ్చారు చిత్ర యూనిట్.
Liger Trailer: నువ్వు ఫైటర్ అయితే మరి నేనేంటి – మైక్ టైసన్
జూలై 21న ఈ చిత్ర ట్రైలర్ ను అత్యంత గ్రాండ్ గా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ ను ఫుల్టూ యాక్షన్ ప్యాక్డ్ గా పూరీ కట్ చేసిన విధానం సూపర్బ్‌గా ఉండటం.. విజయ్ దేవరకొండను పూర్తిగా బాక్సర్ గా మార్చేసిన విధానం అద్భుతంగా ఉండటంతో ఈ ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా వస్తుండటంతో, ఈ చిత్ర ట్రైలర్ ను తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే ఏకంగా 50 మిలియన్ కు పైగా వ్యూస్ రావడంతో రౌడీ స్టార్ క్రేజ్ ఎలా ఉందో యావత్ ఇండియా చూస్తోంది.
Liger: హైప్ క్రియేట్ చేస్తున్న లైగర్.. ట్రైలర్ కోసం ఇద్దరు స్టార్స్!
ఆగ్ లగా దేంగే.. అని ట్రైలర్ లో చెప్పినట్లుగానే ఈ ట్రైలర్ తో యూట్యూబ్ లో ఫైర్ బ్రాండ్ లాగా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుండగా, రమ్యకృష్ణ హీరో తల్లి పాత్రలో నటిస్తోంది. కాగా, లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ అంచనాలను మరింత పెంచేసింది లైగర్ ట్రైలర్. ఆగస్టు 25న ఈ సినిమాతో ఇండియాలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ కాబోతుందా అని సినీ ఎక్స్‌పర్ట్స్ అప్పుడే లెక్కలు వేస్తున్నారు.
#LigerTrailer shakes the nation!
24 Hours⚡
5️⃣0️⃣MILLION+ VIEWS?
Trending1️⃣ on YouTube?
This is what we call – HAVOC?https://t.co/dHJ4lz3cp4#Liger@TheDeverakonda @ananyapandayy #PuriJagannadh @karanjohar @Charmmeofficial @DharmaMovies @PuriConnects @SonyMusicSouth pic.twitter.com/wYPHcLnUQh— Sony Music India (@sonymusicindia) July 22, 2022
