Lingu Swamy : ది వారియర్ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుంది..

ది వారియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ.. ''నా రన్, పందెంకోడి, ఆవారా సినిమాల్ని తెలుగులో బాగా ఆదరించారు. తెలుగు ప్రేక్షకులు నా సినిమాలు...........

Lingu Swamy

The Warrior :  ఉస్తాద్ రామ్‌ పోతినేని, కృతి శెట్టి జంటగా తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ది వారియర్‌’. జులై 14న తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ గా ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. ఇప్పటికే పాటలు, ట్రైలర్ ప్రేక్షకులని అలరించి సినిమాపై మంచి అంచనాలు పెరిగాయి. మొదటి సారి రామ్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపిస్తుండటంతో మరింత అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ది వారియర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఆదివారం సాయంత్రం నిర్వహించారు.

Ram : ఇలాంటి పోలీస్ కథలే చేయాలి.. కాలు బాగోలేకపోయినా డ్యాన్స్ చేశాను..

ది వారియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ.. ”నా రన్, పందెంకోడి, ఆవారా సినిమాల్ని తెలుగులో బాగా ఆదరించారు. తెలుగు ప్రేక్షకులు నా సినిమాలు చూస్తూనే ఉన్నారు. ఇలాంటి ఓ మంచి బృందంతో, మంచి సినిమాతో డైరెక్ట్ గా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడి ఆలోచనలకి న్యాయం చేయాలని తపించే రామ్ లాంటి హీరో దొరకడం అదృష్టం. రామ్‌ నాకు అన్ని విషయాల్లోనూ అండగా నిలిచాడు. ఇదే నిర్మాత, ఇదే హీరో, ఇదే బృందంతో ‘ది వారియర్‌ 2’ కూడా చేస్తాను” అని తెలిపారు.