Ram : ఇలాంటి పోలీస్ కథలే చేయాలి.. కాలు బాగోలేకపోయినా డ్యాన్స్ చేశాను..

ది వారియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో రామ్ మాట్లాడుతూ.. ''పోలీస్‌ కథ చేద్దామని చాలా కథలు విన్నాను. కానీ అన్నీ ఒకేలా అనిపించి ఆ కథలు ఇంక వద్దనుకున్నా. ఆ టైంలో లింగుస్వామి చెన్నై నుంచి..............

Ram : ఇలాంటి పోలీస్ కథలే చేయాలి.. కాలు బాగోలేకపోయినా డ్యాన్స్ చేశాను..

Ram

The Warrior : ఉస్తాద్ రామ్‌ పోతినేని హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా తమిళ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ది వారియర్‌’. జులై 14న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. ఇప్పటికే పాటలు, ట్రైలర్ ప్రేక్షకులని అలరించి సినిమాపై మంచి అంచనాలు పెరిగాయి. మొదటి సారి రామ్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపిస్తుండటంతో మరింత అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ది వారియర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఆదివారం సాయంత్రం నిర్వహించారు.

Krithi Sanon : నా బ్యూటీ సీక్రెట్ ఇదే.. చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది ఇప్పటికి ఫాలో అవుతున్నా..

ది వారియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో రామ్ మాట్లాడుతూ.. ”పోలీస్‌ కథ చేద్దామని చాలా కథలు విన్నాను. కానీ అన్నీ ఒకేలా అనిపించి ఆ కథలు ఇంక వద్దనుకున్నా. ఆ టైంలో లింగుస్వామి చెన్నై నుంచి వచ్చి నాకు ఈ కథ చెప్పారు. ఆయన చెప్పిన కథ విన్న తర్వాత పోలీస్‌ కథలంటూ చేస్తే ఇలాంటివే చేయాలనిపించింది. యాక్షన్ తో పాటు సెంటిమెంట్స్ కూడా ఉన్న కథ ఇది. మనకి సమాజంలో స్ఫూర్తినిచ్చే పోలీస్‌ అధికారులు చాలా మంది ఉన్నారు. మంచి కోసం, ఏదైనా సాధించాలని నుకొని చాలా దూరం ప్రయాణించిన పోలీసులు ఉన్నారు. అలాంటి పోలీసుల కథ ఇది. సత్య అనే పోలీస్‌ పాత్ర చాలా బాగా రాశారు డైరెక్టర్ లింగుస్వామి. అభిమానుల కోసం కాలు బాగాలేకపోయినా కష్టమైనా ఫైట్లు, డ్యాన్సులు చేశాను’’ అని అన్నారు.