Krithi Sanon : నా బ్యూటీ సీక్రెట్ ఇదే.. చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది ఇప్పటికి ఫాలో అవుతున్నా..

తాజాగా కృతి సనన్ ఓ ఇంటర్వ్యూలో తన బ్యూటీ సీక్రెట్ గురించి తెలిపింది. కృతి సనన్ మాట్లాడుతూ.. ''నా మెయిన్ బ్యూటీ సీక్రెట్‌ మంచినీళ్లు. మా అమ్మ చెప్పిన సీక్రెట్‌ అది. చిన్నప్పుడు......

Krithi Sanon : నా బ్యూటీ సీక్రెట్ ఇదే.. చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది ఇప్పటికి ఫాలో అవుతున్నా..

Krithi Sanon

Krithi Sanon :  హీరోయిన్స్ అంత అందంగా ఎలా ఉంటారు? వాళ్ళు అందం, ఆరోగ్యం కోసం ఏం తింటారు? ఏం తాగుతారు అని అందరూ తెలుసుకోవాలి అనుకుంటారు. వాళ్ళ బ్యూటీ సీక్రెట్స్ గురించి ఆరా తీస్తారు. కొంతమంది హీరోయిన్స్ పలు ఇంటర్వ్యూలలో తమ బ్యూటీ సీక్రెట్స్ గురించి చెప్తూ ఉంటారు. తెలుగులో మహేష్ సరసన వన్ నేనొక్కడ్నే సినిమాతో మెపించిన కృతి సనన్ ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తుంది. త్వరలో ఆది పురుష్ లో ప్రభాస్ సరసన కనపడనుంది.

Ranbir Kapoor : మా ఇంట్లో టెన్త్ పాసైన మొదటి వ్యక్తి నేనే.. పాస్ అయినందుకే పెద్ద పార్టీ చేశారు..

తాజాగా కృతి సనన్ ఓ ఇంటర్వ్యూలో తన బ్యూటీ సీక్రెట్ గురించి తెలిపింది. కృతి సనన్ మాట్లాడుతూ.. ”నా మెయిన్ బ్యూటీ సీక్రెట్‌ మంచినీళ్లు. మా అమ్మ చెప్పిన సీక్రెట్‌ అది. చిన్నప్పుడు ఆటల్లో ఉన్నా, చదువులో ఉన్నా మాటి మాటికీ మంచినీళ్లు తాగించేది. అప్పుడు మా అమ్మ వల్ల అయిన అలవాటు ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. మంచినీళ్లు శరీరాన్ని తేమగా ఉంచడమే కాకుండా లోపలున్న టాక్సిన్స్‌ను బయటకు పంపిస్తాయి. చాలా మంది నీళ్లు తాగడాన్ని అశ్రద్ధ చేస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్నవాళ్లు మంచినీళ్లను ఎక్కువగా తాగుతారు. మంచినీళ్లతో పాటు నేను ప్రతిరోజూ తాజా కూరగాయల రసం కూడా తాగుతాను. నా బ్యూటీ సీక్రెట్‌ అదే” అని తెలిపింది.