link between Christopher Nolan new movie and Bhagwat Geeta
Christopher Nolan : ప్రపంచ సినిమా రంగంలో హాలీవుడ్ దర్శకుడు ‘క్రిస్టోఫర్ నోలన్’కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సినిమాలను సైన్స్‌తో, ఆధునిక విజ్ఞాన ఆలోచనలతో తెరకెక్కించడం ఈ దర్శకుడి స్టైల్. ఈ క్రమంలోనే.. ‘ఇన్‌సెప్షన్’, ‘ఇంటర్‌స్టెల్లార్’, ‘టెనెట్’ వంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ప్రయోగాత్మక చిత్రాలే కాదు ‘బాట్ మ్యాన్ బిగిన్స్’, ‘ది డార్క్ నైట్’, ‘ది డార్క్ నైట్ రైస్స్’ వంటి యాక్షన్ సూపర్ హీరో మూవీస్ ని కూడా అందించాడు.
Avatar 2 : అవతార్ మొదటి రోజు కలెక్షన్స్.. ఆ సినిమాల లైఫ్‌టైమ్ కలెక్షన్స్..
ఇప్పుడు ప్రపంచదేశాలని ఒణికించిన ఒక రియల్ స్టోరీతో రాబోతున్నాడు. రెండో ప్రపంచ యుద్దానికి ముగింపు పలికిన ఒక సంఘటనే.. ఇప్పుడు క్రిస్టోఫర్ తెరకెక్కిస్తున్న ‘ఓపెన్‌హోమర్’ సినిమా కథాంశం. ఆ సంఘటనే మొదటి అణుబాంబు ప్రయోగం. అణుబాంబుని కొనగొన్నది రాబర్ట్ ఓపెన్ హోమర్. అయితే ఈ అణుబాంబుని తయారు చేయడానికి స్ఫూర్తిని ఇచ్చింది మాత్రం హిందూ మహాగ్రంధమైన భగవద్గీత అని చెబుతాడు రాబర్ట్.
రాబర్ట్ ఓపెన్ హోమర్.. శాస్త్రీయ విజ్ఞాన పుస్తకాలతో పాటు భగవద్గీతని కూడా చదివాడు. ఈ క్రమంలోనే భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పిన ఒక శ్లోకం అణుబాంబు తయారీకి ప్రేరణ అయ్యింది అంటాడు. అదేంటంటే, ‘సృష్ఠించింది నేనే నాశనం చేసింది నేనే’ అనే శ్లోకం అణుబాంబు తయారీకి కారణమైనట్లు వెల్లడించాడు. మొదటి అణుబాంబు ప్రయోగం 1945 జూలై 16న జరిగింది. ఇప్పుడు ఆ కథతోనే క్రిస్టోఫర్ నోలన్.. ‘ఓపెన్‌హోమర్’ని తెరకెక్కిస్తున్నాడు. నిన్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.