Lokesh Kanagaraj about connection between LCU characters
Lokesh Kanagaraj : లోకేష్ కనగరాజ్ తన LCUలో భాగంగా రీసెంట్ గా ‘లియో’ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చాడు. ఈ సినిమా యూనివర్స్ లో కార్తీని ‘ఢిల్లీ’ పాత్రతో, సూర్యని ‘రోలెక్స్’గా, కమల్ హాసన్‌ని ‘విక్రమ్’ రోల్‌లో, ‘అమర్’గా ఫహద్ ఫాజిల్, ‘లియో’గా విజయ్ ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈ యూనివర్స్ లోకి ఇంకెంత మంది స్టార్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? అని ఆడియన్స్ లో ఆసక్తి నెలకుంది. ఇది ఇలా ఉంటే, ఇప్పటివరకు పరిచయం చేసిన పాత్రలు మధ్య కనెక్షన్ ఎలా ఉంటుందో అని కూడా క్యూరియాసిటీ నెలకుంది.
తాజాగా లోకేష్ కనగరాజ్ ఈ పాత్రలు మధ్య కనెక్షన్ ఎక్కడ మొదలవుతుందో తెలియజేశాడు. “LCUలోని పాత్రలు అన్ని సత్యమంగళం అనే అనాధాశ్రమం నుంచి మొదలవుతాయి. అక్కడ పెరిగిన పిల్లలు పెరిగి బయటకి వచ్చిన తరువాత సొసైటీలో ఉన్న డ్రగ్ మాఫియా మీద పోరాడి.. డ్రగ్ ఫ్రీ సొసైటీగా మార్చడమే LCU స్టోరీ” అంటూ తెలియజేశాడు. విజయ్, ఫహద్ ఫాజిల్ పాత్రలు అక్కడే కలుసుకుంటాయంట. ఇక త్వరలో తెరకెక్కించే ఖైదీ 2లో LCUలో ఉన్న పాత్రలు అన్ని కనిపించబోతున్నాయని లోకేష్ తెలియజేశాడు.
Also read : Rana Daggubati : గర్వంగా ఉందంటున్న రానా భార్య మిహీకా.. ఎందుకో తెలుసా..?
విక్రమ్, రోలెక్స్, అమర్, లియో.. ఇలా అన్ని పాత్రలు ఖైదీ 2లో ఉండనున్నాయని వెల్లడించాడు. కాగా లోకేష్ ఖైదీ 2 కంటే ముందు రజినీకాంత్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఒకవేళ ఆ మూవీ కూడా LCUలో భాగంగా తెరకెక్కితే.. రజినీకాంత్ కూడా ఖైదీ 2లో కనిపించే అవకాశం ఉంటుంది. రజినీకాంత్ ప్రస్తుతం తన 170వ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఆ మూవీ షూటింగ్ పూర్తి అవ్వగానే లోకేష్ సినిమాని పట్టాలు ఎక్కించనున్నాడు. సన్ పిక్చర్స్ ఈ సినిమాని భారీగా నిర్మించబోతోంది.