Lokesh Kanagaraj : హీరోగా మరో ప్రాజెక్టు చేసే యోచనలో లోకేశ్ కనగరాజ్
దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కు (Lokesh Kanagaraj) యువతలో ఉన్న క్రేజ్ ఏంటో చెప్పాల్సిన పనిలేదు
Lokesh Kanagaraj considering another project as a lead actor
Lokesh Kanagaraj : దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కు యువతలో ఉన్న క్రేజ్ ఏంటో చెప్పాల్సిన పనిలేదు. ఖైదీ, విక్రమ్, కూలీ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న లోకేశ్ ఇప్పుడు దర్శకుడిగానే కాదు, నటుడిగానూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఆయన హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ డీసీ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో హీరోగా మరో ప్రాజెక్టు చేయాలని ప్లాన్ చేస్తున్నాడట లోకేశ్ కనగరాజ్. అల్లుఅర్జున్‌తో, లోకేశ్ కనగరాజ్ చేయాలనుకుంటున్న మూవీకి ఇంకా టైమ్ పట్టే అవకాశం ఉందట. అంతలోపే లీడ్ రోల్లో మరో సినిమాను పూర్తి చేసే ఆలోచనలో లోకేశ్ ఉన్నట్లు టాక్.
Rashi Singh : చూస్తుంటే నేను ఇక్కడిదాన్నే అనిపిస్తోంది.. యూరప్‌లో హీరోయిన్ రాశిసింగ్.. ఫోటోలు..
అల్లుఅర్జున్ రాకా లేట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఇదే టైమ్‌లో లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన డీసీ మూవీ మంచి హిట్ అవ్వడంతో ఆయనకు నటుడిగానూ క్రేజ్ పెరిగిందంటున్నారు. దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ ఉన్న లోకేష్, ఇప్పుడు హీరోగా డీసీ మూవీ తో స్క్రీన్‌పై సక్సెస్ అయ్యాడు. దీంతో బన్నీతో రాకా రిలీజ్‌కు ముందే లోకేష్ హీరోగా మరో మూవీ పూర్తి చేసి రిలీజ్ చేయాలనే ప్లాన్ చేస్తున్నాడట.
తక్కువ టైమ్‌లో పూర్తయ్యేలా స్క్రిప్ట్ సిద్ధం చేసి, ఫాస్ట్ షెడ్యూల్లో షూటింగ్ ముగించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా కూడా మరో కొత్త డైరెక్టర్ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్. ఇలా చేస్తే తన హీరో ఇమేజ్ను కొనసాగించడంతో పాటు, రాకా రిలీజ్‌కు ముందు మరో సక్సెస్‌ను ఖాతాలో వేసుకోవచ్చని అనుకుంటున్నారట లోకేష్.
