Lokesh Kanagaraj : లియో ఫేక్ కలెక్షన్స్ పై స్పందించిన డైరెక్టర్ లోకేష్.. సినిమా ల్యాగ్ ఉంది అని ఒప్పుకుంటూ..

తమిళనాడు థియేటర్స్ అసోసియేషన్ ప్రసిడెంట్ తిరుపూర్ సుబ్రహ్మణ్యం, పలువురు థియేటర్స్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్ లియో సినిమా కలెక్షన్స్ ఫేక్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Lokesh Kanagaraj Responds on Leo Movie Fake Collections

Lokesh Kanagaraj : లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో విజయ్(Vijay) హీరోగా ఇటీవల దసరాకు వచ్చిన లియో(Leo) సినిమా తమిళ్ లో హిట్ టాక్ వచ్చినా మిగిలిన ప్లేస్ లలో మాత్రం మిక్స్‌డ్ టాక్ వచ్చింది. విజయ్ అభిమానులని లియో సినిమా సంతృప్తి పరిచినా.. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అభిమానులని మాత్రం నిరుత్సాహపరిచింది. విజయ్ లియో సినిమా మొదటి రోజే 140 కోట్లకు పైగా గ్రాస్, వారం రోజుల్లోనే 461 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది అని చిత్రయూనిట్ ప్రకటించారు.

అయితే ఇటీవల తమిళనాడు థియేటర్స్ అసోసియేషన్ ప్రసిడెంట్ తిరుపూర్ సుబ్రహ్మణ్యం, పలువురు థియేటర్స్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్ లియో సినిమా కలెక్షన్స్ ఫేక్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. లియో సినిమా కలెక్షన్స్ అన్ని ఫేక్ అని, నిర్మాతలు ఫేక్ కలెక్షన్స్ చెప్తున్నారని, తమిళనాడు థియేటర్స్ కి అయితే లాభాలు రాలేదు, నిర్మాత లలిత్ కుమార్ 5 కోట్లు ఖర్చుపెట్టి ఫేక్ బుకింగ్స్, ప్రమోషన్స్ చేయిస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు . తప్పుడు కలెక్షన్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేశారు.

Also Read : Renu Desai : వరుణ్ పెళ్ళికి వెళ్లట్లేదు.. చిన్నప్పట్నుంచి నా కళ్ళ ముందే పెరిగాడు కానీ.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

తాజాగా లియో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఓ ప్రెస్ మీట్ లో పాల్గొనగా అక్కడి మీడియా లియో ఫెయిల్యూర్ పై, లియో కలెక్షన్స్ పై వస్తున్న వార్తల గురించి ప్రశ్నించింది. దీనికి లోకేష్ సమాధానమిస్తూ.. కలెక్షన్స్ విషయం అయితే నాకు తెలీదు, దాని గురించి నిర్మాతలని అడగండి. సినిమా సెకండ్ హాఫ్ అయితే కొంచెం ల్యాగ్ ఉంది అని అంటున్నారు ఆడియన్స్. దానిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని అన్నారు. దీంతో లోకేష్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే లోకేష్ స్వయంగా లియో సినిమా సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉండటాన్ని ఒప్పుకోవడంతో విజయ్ అభిమానులు నిరాశ వ్యక్తపరుస్తున్నారు.