×
Ad

Lokesh Kanagaraj: LCU కథ ముగిసింది.. క్లారిటీ ఇచ్చిన లోకేష్.. మరి ఖైదీ, విక్రమ్ సంగతేంటి?

లోకేష్ సినిమాటిక్ యూనివర్స్(LCU) పై ఆసక్తికర కామెంట్స్ చేసిన లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj).

Lokesh Kanagaraj shocking comments about the Lokesh Cinematic Universe.

  • లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ క్లోజ్ అంటూ వార్తలు
  • క్లారిటీ ఇచ్చిన దర్శకుడు లోకేష్ కనగరాజ్
  • అల్లు అర్జున్ తరువాత ఆ సినిమా చేస్తాడట

Lokesh Kanagaraj: తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఖైదీ సినిమాతో తానేంటో ప్రూవ్ చేసుకున్న ఈ దర్శకుడు ఆ తరువాత మాస్టర్, విక్రమ్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. అలా తన సినిమాలకు లింక్ చేస్తూ LCU(లోకేష్ సినిమాటిక్ యూనివర్స్)ని క్రియేట్ చేశాడు. ఈ యూనివర్స్ లో భాగంగా ఇప్పటికే ఖైదీ, విక్రమ్, లియో సినిమాలకు లింక్ చేశాడు దర్శకుడు లోకేష్.

అందుకే, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి భారీ డిమాండ్ ఏర్పడింది. ఆడియన్స్ ఈ యూనివర్స్ లో తదుపరి రానున్న సినిమాల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ, గత కొన్ని రోజులుగా LCU క్లోజ్ అయ్యింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ న్యూస్ చూసిన లోకేష్ ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అవుతున్నారు. ఎందుకు LCU క్లోజ్ చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Lahari shari: కూల్ మంచులో హాట్ సొగసులు.. బిగ్ బాస్ బ్యూటీ లహరి గ్లామర్ షో.. ఫొటోలు

అయితే, ఈ వార్తలు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) వరకు వెళ్లడంతో తాజాగా ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చాడు ఈ దర్శకుడు. ‘గత వారం రోజులుగా lCU క్లోజ్ అయ్యింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆవార్తలో ఎలాంటి నిజం లేదు. ఖైదీ 2 కూడా ఆగిపోయింది అంటుంన్నారు. కానీ, అందులో కూడా ఎలాంటి నిజం లేదు. అల్లు అర్జున్ తో నేను చేస్తున్న సినిమా తరువాత నేను చేస్తున్న సినిమా ఖైదీ 2.

ఆ తరువాత విక్రమ్ 2, రోలెక్స్ సినిమాలు కూడా వరుసగా వస్తాయి. లారెన్స్ తో చేస్తున్న బెంజ్ సినిమా కూడా LCUలో భాగంగానే ఉంటుంది. దయచేసి రూమర్స్ ని నమ్మకండి” అంటూ క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. దీంతో, ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక లోకేష్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. సరికొత్త కథ, కథనాలతో వస్తున్న ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.