Leo Movie : లియో మూవీలో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడా..? సోషల్ మీడియాలో ట్రోల్స్..
లోకేష్ కనగరాజ్, విజయ్ కాంబినేషన్ లో వస్తున్న లియో మూవీ ట్రైలర్ తాజాగా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. అయితే ఈ ట్రైలర్ ఆడియన్స్..
- gum 95921
- Published On : October 6, 2023 / 08:51 AM IST
Lokesh Kanagaraj Thalapathy Vijay Leo Movie trailer audience reaction
Leo Movie : విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత లోకేష్ కనగరాజ్, విజయ్ తో కలిసి చేస్తున్న సినిమా ‘లియో’. ఇక గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘మాస్టర్’ వంటి బ్లాక్ బస్టర్ ఉండడంతో ‘లియో’ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇటీవల విక్రమ్, ఖైదీ సినిమాలకు కనెక్షన్ పెట్టి ఒక సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసిన లోకేష్.. ఈ చిత్రాన్ని కూడా ఆ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిస్తున్నాడా? అనే ఆసక్తి నెలకుంది. దీంతో ఈ మూవీ ట్రైలర్ కోసం అందరూ క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు.
తాజాగా ఈ ట్రైలర్ ని మేకర్స్ ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. భారీ హైప్ తో రిలీజ్ అయిన ఈ ట్రైలర్.. ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది. అంతేకాకుండా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటుంది. ట్రైలర్ చూస్తుంటే.. ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడా..? అనే సందేహం కలుగుతుంది. తన లాగానే ఉన్న ఒక వ్యక్తి కోసం గ్యాంగ్ స్టార్స్ వెతకడం, ఈక్రమంలో అదే పోలికలతో ఉన్న హీరోని చూడడం, అతని చంపడం కోసం మొత్తం గ్యాంగ్ స్టార్స్ అంతా ప్రయత్నించడం, హీరో తనని తన ఫ్యామిలీ కాపాడుకోవడం కోసం పోరాడడం.. మూవీ స్టోరీ అని తెలుస్తుంది.
Also read : MAD Movie Review : ‘మ్యాడ్’ సినిమా రివ్యూ.. రెండు గంటల పాటు కడుపు చెక్కలయ్యేలా నవ్వుకోవచ్చు..
ఇక ట్రైలర్ లో అర్ధమైన కథని బట్టి నెటిజెన్స్ పలు కామెంట్స్, ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే.. విజయ్ నటించిన ‘తేరి’ మూవీకి ఇది సీక్వెల్ లా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక స్టోరీ మెయిన్ లైన్ చూస్తుంటే.. తెలుగు ఆడియన్స్ కి రవితేజ ‘విక్రమార్కుడు’ స్టోరీ గుర్తుకు వస్తుంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ మూవీ వస్తుంది అనుకుంటే.. అసలు ఆ ఛాయలే కనిపించకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. మరి లోకేష్ మూవీతో ఆడియన్స్ ని ఎలా ఆకట్టుకోబోతున్నాడో చూడాలి. అక్టోబర్ 19న తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది.
