నవ్వించే లూట్‌కేస్ – ట్రైలర్
కునాల్ ఖేము, రసికా దుగల్ జంటగా, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సమర్పణలో, కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న'లూట్‌కేస్'.. అక్టోబర్ 11 విడుదల..

కునాల్ ఖేము, రసికా దుగల్ జంటగా, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సమర్పణలో, కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న’లూట్‌కేస్’.. అక్టోబర్ 11 విడుదల..
కునాల్ ఖేము, రసికా దుగల్ జంటగా, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సమర్పణలో, కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘లూట్‌కేస్’.. రాజేష్ కృష్ణన్ డైరెక్ట్ చేస్తున్నాడు. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. MLAకి సంబంధించిన ఓ డబ్బు సూట్‌కేస్ మిస్ అవడం, దాన్ని వెతకడానికి ఓ డాన్ తన గ్యాంగ్‌తో ప్రయత్నించడం..
ఆ సూట్‌కేస్ అనుకోకుండా.. మిడిల్ క్లాస్ బతుకు బతకలేక, పెళ్లాం పోరు పడలేక అల్లాడుతున్న హీరోకి దొరకడం, అతను ఆ డబ్బుని దాచలేక అష్టకష్టాలూ పడడం.. చివరకు పోలీసులు రంగంలోకి దిగడం.. ఇలా సాగిపోయింది ‘లూట్‌కేస్’ ట్రైలర్..
హీరోతో పాటు డాన్, అతని గ్యాంగ్ పండించిన కామెడీ బాగుంది. సినిమా పక్కా ఎంటర్‌టైనర్ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. విజయ్ రాజ్, రణ్‌వీర్ షోరే, గజరాజ్ రావ్ తదితరులు నటించిన ‘లూట్‌కేస్’ అక్టోబర్ 11న విడుదల కానుంది.