Hollywood : తగలబడుతున్న హాలీవుడ్.. షూటింగ్ లు బంద్.. స్టార్ నటీనటుల ఇళ్ళు కూడా మంటల్లో..

చాలా మంది హాలీవుడ్ నటీనటుల ఇళ్ళులు కూడా ఈ కార్చిచ్చుకు దగ్డం అయ్యాయని హాలీవుడ్ మీడియాలు ప్రకటించాయి.

Los Angeles wildfire burns homes of Hollywood celebrities

Hollywood : అప్పుడప్పుడు ప్రకృతి వైపరీత్యాల వల్ల భారీ నష్టం మిగులుతుంది. గత కొన్ని రోజులుగా అమెరికా మంచులో తడిసి ముద్దయింది. కానీ ఇంతలోనే కార్చిచ్చు అంటుకుంది. అమెరికా లాస్ ఏంజిల్స్ లో నిన్న రాత్రి కార్చిచ్చి అంటుకుంది. అడవుల్లో అంటుకున్న కార్చిచ్చు సిటీలోకి వచ్చింది. దీంతో లాస్ ఏంజిల్స్ లోని ఇళ్ళు, షాప్స్ తగలబడుతున్నాయి. హాలీవుడ్ హిల్స్, హాలీవుడ్ సినిమాలకు, హాలీవుడ్ నటీనటులకు లాస్ ఏంజిల్స్ స్థావరం.

Also Read : Gandhi Tatha Chettu : సుకుమార్ కూతురి ఫస్ట్ సినిమా.. గాంధీ తాత చెట్టు ట్రైల‌ర్ వ‌చ్చేసింది..

దీంతో చాలా మంది హాలీవుడ్ నటీనటుల ఇళ్ళులు కూడా ఈ కార్చిచ్చుకు దగ్డం అయ్యాయని హాలీవుడ్ మీడియాలు ప్రకటించాయి. బెన్ అప్లెక్, టామ్ హ్యాంక్స్, స్టీవెన్ స్పీల్ బర్గ్, మైకేల్ కేతన్, మిలి సైరస్, మార్క్ హామిల్, మాండీ మూర్.. ఇలా చాలా మంది హాలీవుడ్ స్టార్స్ ఇళ్ళు కార్చిచ్చుకు ఆహుతయ్యాయి. వీళ్ళే కాకుండా అక్కడ నివసించే హాలీవుడ్ సినీ పరిశ్రమకు సంబంధిచిన చాలా మంది ఇళ్ళు, వారి ప్రాపర్టీస్ అగ్నికి ఆహుతయ్యాయి.

దీంతో స్టార్ నటీనటులు సైతం కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడ్డారు. ఆస్తి నష్టం అయితే భారీగానే జరిగింది. ప్రాణ నష్టం ఎంత జరిగింది వివరాలు ఇంకా బయటకు రాలేదు. సామాన్యుల ఇళ్ళు సైతం అగ్నికి ఆహుతవడంతో వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. హాలీవుడ్ హిల్స్ లో కూడా అనేక షూటింగ్ ప్రదేశాలు తగలబడినట్టు సమాచారం. లాస్ ఏంజిల్స్ కార్చిచ్చుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హాలివుడ్ త్వరగా కోలుకోవాలని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. దీంతో హాలీవుడ్ సినిమా షూటింగ్స్ కి బంద్ ప్రకటించారు.

Also Read : Game Changer Song : గేమ్ ఛేంజర్ ‘అన్‌ప్రెడిక్టబుల్..’ సాంగ్ రిలీజ్.. స్టైలిష్ గా ఉందిగా.. విన్నారా?

లాస్ ఏంజిల్స్ కార్చిచ్చు కారణంగా ఆస్కార్‌ నామినేషన్ల ప్రక్రియ కూడా వాయిదా వేశారు. హాలీవుడ్ సినీ పరిశ్రమ అంతా లాస్ ఏంజిల్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆస్కార్‌ అవార్డుల వేడుక కూడా అక్కడే జరగనుంది. జనవరి 8 నుంచి 14 వరకు ఆస్కార్‌ నామినేషన్‌ ప్రక్రియ కొనసాగనుంది. కార్చిచ్చు నేపథ్యంలో జనవరి 17న ప్రకటించాల్సిన ఆస్కార్‌ నామినేషన్లను జనవరి 19కు వాయిదా వేశారు. అన్నిరకాలుగా హాలీవుడ్ సినీ పరిశ్రమ ఈ కార్చిచ్చుతో భారీగా నష్టపోయింది.