Gandhi Tatha Chettu : సుకుమార్ కూతురి ఫస్ట్ సినిమా.. గాంధీ తాత చెట్టు ట్రైల‌ర్ వ‌చ్చేసింది..

స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన మూవీ గాంధీ తాత చెట్టు

Gandhi Tatha Chettu : సుకుమార్ కూతురి ఫస్ట్ సినిమా.. గాంధీ తాత చెట్టు ట్రైల‌ర్ వ‌చ్చేసింది..

Gandhi Tatha Chettu Trailer out now

Updated On : January 9, 2025 / 4:10 PM IST

స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన మూవీ గాంధీ తాత చెట్టు. పద్మావతి మల్లాది దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. మైత్రీ మూవీ మేక‌ర్స్, సుకుమార్ రైటింగ్స్‌, గోపీ టాకీస్ సంస్థ‌లపై న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్‌, శేష సింధు రావులు ఈ చిత్రాన్ని నిర్మించారు. సుకుమార్‌ భార్య తబితా సుకుమార్ ఈ చిత్రానికి సమర్పకురాలు. ఇప్ప‌టికే ఈచిత్రానికి దేశ విదేశాల్లో ఎన్నో అవార్డులు వ‌చ్చాయి.

ఈ చిత్రం జ‌న‌వ‌రి 24న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుల చేయించారు. సుకృతి ఎంతో అద్భుతంగా న‌టించింది.

Game Changer Song : గేమ్ ఛేంజర్ ‘అన్‌ప్రెడిక్టబుల్..’ సాంగ్ రిలీజ్.. స్టైలిష్ గా ఉందిగా.. విన్నారా?

గాంధీ గారి సిద్ధాంతాలు అభిమానిస్తూ ఆయ‌న బాట‌ను అనుస‌రించే ఓ ప‌ద‌మూడేళ్ల అమ్మాయి త‌ను పుట్టిన ఊరిని ఎలా కాపాడుకోవ‌డం కోసం ఏం చేసింది అనే క‌థాంశంలో ఈ చిత్రం తెర‌కెక్కినట్లుగా ట్రైల‌ర్‌ను బ‌ట్టి తెలుస్తోంది. మొత్తంగా ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటోంది.

ఇప్ప‌టికే ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఎలా మెప్పింస్తుందో చూడాలి. సుకృతి వేణి ఓ పక్క చదువుకుంటూనే మరో పక్క ఇలా నటన, దర్శకత్వం నేర్చుకుంటూనే ఫ్యాషన్ షోలలో కూడా పాల్గొంటుంది.

Mohan babu : సినీ న‌టుడు మోహ‌న్‌బాబుకు సుప్రీం కోర్టులో ఊర‌ట‌..