Bomma Blockbuster
Bomma Blockbuster: బై బర్త్ యు అర్ ది ఫస్టస్ట్ రన్నర్.. యు ఆల్రెడీ విన్నర్.. నీయయ్య పుట్టడానికే ఇన్ని యుద్దాలు చేసిన నీకు లైఫ్ ఒక లెక్కనా.. పుట్టుకతోనే నువ్వు గెలిచి వచ్చావ్.. ఇంకా నీకు ఓటమి ఏంటన్నా.. ఈ మాటలు వింటే అర్ధం కావడం లేదా.. ఔను.. దర్శకుడు పూరి జగన్నాధ్ మాటలే. బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా నుండి పూరి మాటలతో మొదలయ్యే పాటను విడుదల చేశారు.
Telugu Film Shooting: జెట్ స్పీడ్‌తో టాలీవుడ్.. ఏ సినిమా ఎక్కడ షూట్‌లో ఉందంటే
విభిన్నమైన చిత్రాలు చేస్తూ నటుడిగా తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరుని సంపాదించిన నందు విజయ్‌కృష్ణ హీరోగా.. యాంకర్ గా, హీరోయిన్ గా తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న రష్మి హీరోయిన్ గా చేస్తున్న సినిమా బొమ్మ బ్లాక్‌బస్టర్. ఈ చిత్రాన్ని విజయీభవ ఆర్ట్స్ పతాకం పై ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడు రాజ్ విరాట్ పరిచయమవుతున్నాడు. ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా పాటలకు, టీజర్ కు అటు ఆడియెన్స్ లో.. ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అనూహ్య స్పందన వచ్చింది.
Prabhas: ఫ్యాన్స్ ఆకలి తీర్చేసే రెబల్ స్టార్.. ట్రిపుల్ బొనాంజా!
ట్రేడ్ లో కూడా బిజినెస్ క్రేజ్ ని సొంతం చేసుకుంటున్న ఈ బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా ఆడియో ఆల్బమ్ నుంచి వచ్చిన పాటలు మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా యంగ్ హీరో, పూరీ జగన్నాథ్ తనయడు పూరీ ఆకాష్ ఈ చిత్రం నుంచి ‘Love all the haters – Puri Anthem’ విడుదల చేశారు. సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్ మాటలతో మొదలైన ఈ పాట.. అద్భుతమైన లిరిక్స్‌తో సాగుతుంది. దీనికి అనూహ్య స్పందన వస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే చిత్ర యూనిట్ తెలియజేయనున్నారు.