Love Story Release Of The Naga Chaitanya Sai Pallavi New Movie Postponed
Love Story Movie Release Postponed : అక్కినేని అభిమానులకు మళ్లీ షాక్.. నాగచైతన్య కొత్త మూవీ లవ్ స్టోరీ రిలీజ్ వాయిదా పడింది. కొన్నిరోజులుగా చైతూ, సాయి పల్లవిల మూవీ విడుదల విషయంలో చిత్ర యూనిట్ తేల్చుకోలేకపోతోంది. చూస్తుంటే.. చైతూ లవ్ స్టోరీ రిలీజ్ ఇప్పట్లో లేనట్టే కనిపిస్తోంది. ఏపీలో థియేటర్ల సమస్యల పరిష్కారంలో పురోగతి లభించలేదు. దాంతో మూవీ రిలీజ్ వాయిదా వేయడమే బెటర్ అనుకుంది చిత్ర యూనిట్.. సో మళ్లీ లవ్ స్టోరీ రిలీజ్ వాయిదా పడింది. ఇప్పటికే కరోనా కారణంగా మూవీ వాయిదా పడింది.
చైతూ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు తెరుచుకున్నాయి. చాలా సినిమాలు కూడా హిట్ టాక్ అందుకున్నాయి. థియేటర్ల సమస్యల పరిష్కారంలో స్పష్టత లేకపోవడంతో సినిమాలు రిలీజ్ చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. అప్పట్లో థియేటర్లలో నాలుగు షోలు వేసినప్పుడే లవ్ స్టోరీ మూవీ రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ స్పష్టం చేసింది. లవ్ స్టోరీ సినిమా విడుదలపై అనేక రుమార్లు వచ్చాయి.
అన్నింటికి చెక్ పెడుతూ లవ్ స్టోరీ వినాయక చవితి సందర్భంగా థియేటర్లలో సెప్టెంబర్ 10న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. అయితే మళ్లీ లవ్ స్టోరీ మూవీ వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఈ సినిమాపై మరోసారి మేకర్స్ వెనక్కి తగ్గినట్లుగా సమాచారం. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ మూవీలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు.