Chinmayi
Chinmayi: లక్నోలోని ఓ రోడ్డు మీద సిగ్నల్ దగ్గర ఓ క్యాబ్ డ్రైవర్‌ను, అతనికి సపోర్ట్‌గా వచ్చిన మరో వ్యక్తిని ఓ యువతి ఉత్తపుణ్యానికే రెచ్చిపోతూ చితకబాదింది. జులై 30న రాత్రి 9.40కి ఈ ఘటన జరగ్గా ఎవరో ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ యువతి ఆ క్యాబ్ డ్రైవర్ ఫోన్ పగలకొట్టడంతో పాటు కారులో ఉన్న రూ.600 లాగేసుకుంది. అదంతా అంతా అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్, వాహనదారులంతా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. చాలాసేపు ట్రాఫిక్ కూడా జామ్ అయ్యింది. దీంతో ఆ యువతిని అరెస్ట్ చేయాలంటూ పెద్ద ఎత్తునే నిరసన నడవడంతో ఫైనల్ గా పోలీసులు స్పందించి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరి కెమెరాల ఆధారంగా అక్కడేం జరిగిందో విచారణ జరిపి యువతిని అదుపులోకి తీసుకున్నారు.
ఆ తర్వాత ఈ ఎపిసోడ్ ఎలా ముగిసిందో పెద్దగా ప్రచారంలోకి రాలేదు. కానీ.. ఆ యువతి ఎపిసోడ్ తో సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయికి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. ఈ వ్యవహారంలో చిన్మయి ప్రస్తావన లేకపోయినా ఆమెని ఈ వివాదంతో జత చేసి నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆమె ఎక్కువగా ఆడ వాళ్లకు అండగా నిలబడి ఫెమినిజం పేరుతో రకరకాల పోస్టులు పెడుతూ ఒకవిధంగా పోరాటమే కొనసాగిస్తుంది. అందుకే.. మగవాళ్ల చేతలో బలైపోయిన ఆడవాళ్లే కాదు.. ఆడవాళ్ళ చేత బజారున పడ్డ మగాళ్ళపై కూడా స్పందించాలని చిన్మయికి ట్యాగ్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు.
మరికొందరైతే ఏకంగా ఈమె ఇన్ బాక్స్ లోకి వెళ్లి కూడా పర్సనల్ మెసేజెస్ పెడుతున్నారట. పోస్టులు, మెసేజ్లే కాదు.. మీమ్స్, జోక్స్ కూడా చేసి ఆమెని ట్యాగ్ చేస్తున్నారు. దీనిపై ముందుగా స్పందించిన చిన్మయి బెంగళూరు ఘటనలో జొమాటో ఉద్యోగి ఉద్యోగం పోలేదని, అలాగే లక్నో ఘటనలో క్యాబ్ డ్రైవర్ ఉద్యోగం కూడా పోలేదని ఆమె కామెంట్ చేశారు. దీంతో నెటిజన్లు మరింత రెచ్చిపోయారు. దీంతో చిన్మయి లైవ్ లో కి వచ్చి రెచ్చిపోయింది.
తప్పు ఎవరు చేసినా తప్పే అంటూనే తనకు రోజుకి వందల సంఖ్యలో అసభ్యకరంగా మెసేజీలు వస్తుంటాయని.. అందులో కొందరు యువకులు పురుషాంగాలను, హస్త ప్రయోగం చేస్తూ ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తున్నారని అలాంటి వారిని ఏం చేయాలో ప్రశ్నించింది. ఇన్ బాక్స్ లో వచ్చే బూతులు చదవడానికి కూడా దారుణంగా ఉంటాయని.. ఈ సమాజంలో బాధితులే నిందితులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మరి ఈ ఎపిసోడ్ మీద ట్రోల్ చేసిన నెటిజన్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.