సీనియర్ నటుడు అయిన గొల్లపూడి మారుతీ రావుకు ఇదేనా మీరిచ్చే గౌరవం ? చెన్నైలో నివాసం ఉండే..నటులంటే లోకువా ? అంటూ ప్రశ్నించారు నిర్మాత, సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్. మా అసోసియేషన్ తీరుపై ఆయన మండిపడ్డారు. ఎందుకంటే..గొల్లపూడి అంత్యక్రియలను మా అసోసియేషన్ పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు.
2019, డిసెంబర్ 15వ తేదీ చెన్నైలో గొల్లపూడి మారుతీ రావు అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య జరిగాయి. దీనికి మా అసోసియేషన్ ప్రతినిధులు రాలేదు. డిసెంబర్ 15వ తేదీ ఆదివారం కాట్రగడ్డ ప్రసాద్‌తో 10tv మాట్లాడింది. దాదాపు 250 సినిమాలు నటించిన..గొల్లపూడి హఠాన్మరం తెలుగు సినీ చరిత్రకు, రచయితల సంఘానికి తీరని లోటుగా అభివర్ణించారు.
ఒక లెజెండ్..మరణించారని తెలుసుకున్న తాను ఉదయమే..ఆయన నివాసానికి వెళ్లడం జరిగిందన్నారు. కానీ మా అసోసియేషన్ ప్రతినిధులు ఎవరూ రాలేదని, ఫండ్స్ కూడా ఉన్నాయన్నారు. అందులో ఉన్న వారు..గొల్లపూడితో నటించారని గుర్తు చేశారు. తెలుగు పరిశ్రమ పుట్టిందే..చెన్నైలో..కానీ అసోసియేషన్ నుంచి ఒక్కరైనా వచ్చి..నివాళులు అర్పించి..అంత్యక్రియల్లో పాల్గొంటే బాగుండేదన్నారు.
నాలుగైదు సినిమాలు నటించిన వారు..ఎక్కడకు వెళ్లిపోతారని..మాలో ఉన్న మెంబర్లు నిర్మాతలకు సహకరించిన వారు లేరన్నారు. కానీ గొల్లపూడి మారుతీరావు భిన్నంగా ఉండేవారని, నిర్మాతలకు సహకరించే వారని కొనియాడారు. మెగాస్టార్ చిరంజీవి, ఎస్పీ బాల సుబ్రమణ్యం, సుహాసిని, ఇతరులు పర్సనల్‌గా వచ్చారని, చెన్నైకి మా అసోసియేషన్ ప్రతినిధులు వస్తే తప్పా, దీనిని ఖండిస్తున్నట్లు చెప్పారు.