Karate Kalyani : కరాటే కల్యాణికి షాక్ ఇచ్చిన మంచు విష్ణు.. మా సభ్యత్వం రద్దు..

ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీకృష్ణుడి రూపంలో ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఈ విగ్రహావిష్కరణ నిలిపివేయాలంటూ సినీ నటి కరాటే కళ్యాణి అభ్యంతరం వ్యక్తం చేస్తూ మీడియా ముందుకి వచ్చింది.

Karate Kalyani – MAA Association :  నందమూరి తారక రామారావు(NTR) శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన 100వ పుట్టిన రోజు మే 28న ఖమ్మంలో (Khammam) 54 అడుగులు ఎత్తులో శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరగబోతుంది. ఈ విగ్రహావిష్కరణకు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వెళ్లబోతున్నాడు. తెలంగాణ (Telangana) రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ విగ్రహావిష్కరణ జరగనుంది.

చాలామందికి రాముడు, కృష్ణుడు అంటే ఎన్టీఆర్ గుర్తొస్తారు. ఆయన చేసిన సినిమాల ప్రభావం అలాంటింది. అందుకే ఎన్టీఆర్ అభిమానులంతా ఆయన్ని దేవుడి రూపంలోనే చూడటానికి ఇష్టపడతారు. ఆ నేపథ్యంలోనే ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీకృష్ణుడి రూపంలో ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఈ విగ్రహావిష్కరణ నిలిపివేయాలంటూ సినీ నటి కరాటే కళ్యాణి అభ్యంతరం వ్యక్తం చేస్తూ మీడియా ముందుకి వచ్చింది. ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకోండి కానీ మా దేవుడు కృష్ణుడి రూపంలో కాదు అంటూ గత కొన్ని రోజులుగా రచ్చ చేస్తోంది.

Ram Charan : కొత్త టాలెంటుని ఎంకరేజ్ చేయడానికి.. మరో కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభిస్తున్న రామ్ చరణ్

ఇప్పటికే దీనిపై సీరియస్ అయిన మంచు విష్ణు ఆమెకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయినా కల్యాణి లెక్కచేయకుండా హైకోర్టులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణపై పిటిషన్ వేసింది. విగ్రహాన్ని మార్చాలని లేదా విగ్రహావిష్కరణ ఆపాలంటూ కోర్టులో పిటిషన్ వేసింది కల్యాణి. దీంతో మా అసోసియేషన్ మరింత సీరియస్ అయింది. గతంలో ఇచ్చిన షోకాజ్ నోటీసులకు కూడా సమాధానం ఇవ్వకపోవడంతో నేడు కరాటే కల్యాణి సభ్యత్వం రద్దు చేస్తున్నట్టు మా అసోసియేషన్ నుంచి జనరల్ సెక్రటరీ రఘు బాబు నోటీసులు రిలీజ్ చేశారు. మరి దీనిపై కరాటే కల్యాణి ఏం స్పందిస్తుందో చూడాలి.

గతంలో షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పుడే నేను అసోసియేషన్ తో మాట్లాడతాను, నేనేమి తప్పు చెయ్యట్లేదు, ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకోండి కానీ దేవుడి రూపంలో పెడితే మాత్రం ఊరుకునేది లేదు అంటూ మాట్లాడింది. ఈ వివాదం ఇంకెక్కడిదాకా వెళ్తుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు