MAA : అక్టోబర్ 10న ‘మా’ ఎన్నికలు.. విష్ణు ప్యానెల్‌లో రఘుబాబు, బాబూ మోహన్

మంచు విష్ణు ప్యానెల్ నుంచి జనరల్ సెక్రెటరీగా నటుడు రఘబాబు పోటీలో దిగుతున్నారు..

MAA : అక్టోబర్ 10న ‘మా’ ఎన్నికలు.. విష్ణు ప్యానెల్‌లో రఘుబాబు, బాబూ మోహన్

Raghubabu

Updated On : September 18, 2021 / 1:26 PM IST

MAA Elections 2021: ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది ‘మా’ ఎలక్షన్స్ మంచి రసవత్తరంగా మారాయి. అధ్యక్షబరిలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, యంగ్ హీరో మంచు విష్ణు, సీనియర్ నటుడు CVL నరసింహారావు పోటీపడుతున్నారు. మధ్యలో సడెన్‌గా వచ్చి బండ్ల గణేష్ రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే.

MAA Elections 2021 : ‘మా’ సభ్యులకు ప్రకాష్ రాజ్ విందు.. కౌంటర్ ఇచ్చిన బండ్ల గణేష్..

ఇప్పుడు మంచు విష్ణు టీమ్‌లో పాపులర్ కమెడియన్ రఘుబాబు జాయిన్ అయ్యారు. మంచు విష్ణు ప్యానెల్ నుంచి జనరల్ సెక్రెటరీగా ఆయన పోటీలో దిగుతున్నారు. అలాగే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాబు మోహన్ పోటీలో నిలుస్తున్నారు. త్వరలో తన ప్యానెల్ సభ్యులను, అజెండాను ప్రకటించనున్నారు మంచు విష్ణు..

Prakash Raj : వీరాభిమాని పాదయాత్ర.. విలక్షణ నటుడు ట్వీట్ వైరల్..

అక్టోబర్ 10 న ‘మా’ అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి ‘మా’ అధ్యక్ష స్థానానికి ముగ్గురు పోటీపడుతుండడంతో ఫిలింనగర్‌లో గెలుపు ఎవరిది అనే ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ‘మా’ సభ్యులను ఆకట్టుకొనే ప్రయత్నంలో ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్రచారంలో దూసుకుపోతున్నారు.

Bandla Ganesh : ఎప్పుడు ఏం మాట్లాడాలో నేర్చుకోండి.. వివరణ ఇచ్చిన వీకే నరేష్