Bandla Ganesh : ఎప్పుడు ఏం మాట్లాడాలో నేర్చుకోండి.. వివరణ ఇచ్చిన వీకే నరేష్

రోడ్డు ప్రమాదానికి గురైన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గురించి వీకే నరేష్ చేసిన కామెంట్స్‌పై బండ్ల గణేష్ ఫైర్ అయ్యారు..

Bandla Ganesh : ఎప్పుడు ఏం మాట్లాడాలో నేర్చుకోండి.. వివరణ ఇచ్చిన వీకే నరేష్

Sai Tej

Bandla Ganesh: రోడ్డు ప్రమాదానికి గురైన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు వెల్లడించారు. మెగా కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీ వారు ఆసుపత్రికి వెళ్లి ఆయణ్ణి పరామర్శించారు. అయితే శనివారం ఉదయం సీనియర్ నటుడు, ‘మా’ అధ్యక్షుడు వీకే నరేష్, సాయి ధరమ్ తేజ్‌కి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రీసెంట్‌గా నరేష్ చేసిన కామెంట్స్‌పై నటుడు, నిర్మాత బండ్ల గణేష్ రియాక్ట్ అయ్యారు.

సాయి ధరమ్ తేజ్ గురించి వీకే నరేష్ వ్యాఖ్యలు..
‘‘మా అబ్బాయి నవీన్, సాయి ధరమ్ తేజ్ క్లోజ్ ఫ్రెండ్స్. ప్రమాదం జరిగే ముందు వాళ్లిద్దరు మా ఇంటి నుంచే బయలు దేరారు.. నేను చెబుదామనుకునే లోపే వెళ్ళిపోయారు.. నాలుగైదు రోజుల క్రితమే వీళ్లకు కౌన్సిలింగ్ చేద్దామని అనుకున్నాను.. పెళ్లి చేసుకుని కెరీర్ చూసుకోవాల్సిన ఈ వయస్సులో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదు..
నాకు ఒకసారి బైక్ ప్రమాదం జరిగినప్పుడు మా అమ్మ ఒట్టు వేయించారు. అప్పటి నుంచి బైక్‌లు ముట్టలేదు.. కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్, కోమటి రెడ్డి గారి అబ్బాయిలు ఇటువంటి ప్రమాదాలకు గురై కుటుంబాలను శోక సముద్రంలో ముంచెత్తారు.. కుటుంబం, నిర్మాతల శ్రేయస్సు కోరి ఈ బైక్ ముట్టుకోకుండా ఉండాలని నా ప్రార్ధన’’..

Sai Dharam Tej : తేజ్ కోలుకోవాలంటూ మోకాళ్లతో మెట్లెక్కారు.. వృద్ధుల ఉపవాసం

బండ్ల గణేష్ ఫైర్..
‘‘సాయి ధరమ్ తేజ్‌కు జరిగింది చిన్న ప్రమాదం.. త్వరలోనే షూటింగ్‌లకు అటెండ్ అవుతారు.. నరేష్ గారూ ఈ టైం లో ప్రమాదంలో చనిపోయిన వాళ్ల పేర్లు చెప్పడం కానీ, మాఇంటి కొచ్చాడు.. రేసింగ్‌లు చేశారు అని చెప్పడం మంచిదికాదు.. ఎప్పుడు ఏం మాట్లాడాలో నేర్చుకోండి.. పరమేశ్వరుని దయ వల్ల అతను త్వరగా కోలుకోవాలి’’..

Sai Dharam Tej : వాళ్ల మీద కేసు ఫైల్ చెయ్యాలి..

మరోసారి వీకే నరేష్ వివరణ..
సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నాడు.. తేజ్, మా అబ్బాయి నవీన్ ఇద్దరూ టీ షాప్ ఓపెనింగ్‌కి వెళ్ళారు. ఇంటికి వేరు వేరుగా బయలు దేరారు. సాయి ధరమ్ తేజ్ సపరేట్‌గా ఉన్నాడు.. రేసింగ్ చెయ్యలేదు. సాయి ధరమ్ తేజ్ నార్మల్ స్పీడ్‌లోనే వెళుతున్నాడు. రోడ్డు మీద ఉన్న మట్టి వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఇది నిర్లక్ష్యం కాదు ప్రమాదమే. బిడ్డలు బాగుండాలి అని కోరుకుంటున్నాను తప్ప వేరే ఆలోచన లేదు. సాయి ధరమ్ తేజ్ సేఫ్‌గా కోలు కుంటున్నందుకు సంతోషంగా ఉంది.