MAA Elections 2021 : ‘మా’ సభ్యులకు ప్రకాష్ రాజ్ విందు.. కౌంటర్ ఇచ్చిన బండ్ల గణేష్..

‘మా’ సభ్యులకు, అధ్యక్షబరిలో పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ విందు ఏర్పాటు చెయ్యడం మంచిది కాదంటూ బండ్ల గణేష్ వీడియో విడుదల చేశారు..

MAA Elections 2021 : ‘మా’ సభ్యులకు ప్రకాష్ రాజ్ విందు.. కౌంటర్ ఇచ్చిన బండ్ల గణేష్..

Prakash Raj

Updated On : September 12, 2021 / 12:56 PM IST

MAA Elections 2021: ‘మా’ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. ‘మా’ అధ్యక్ష అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సినిమా వాళ్లకు అడ్డా అయిన యూసఫ్ గూడాలోని గణపతి కాంప్లెక్స్ దగ్గర సినిమా, టీవీ కళాకారులను ప్రకాష్ రాజ్ మరియు ప్యానెల్ సభ్యులు కలిశారు.

Maa Members

ఈ సందర్భంగా ఆదివారం ఫిలింనగర్‌లోని జే‌ఆర్‌సి కన్వెన్షన్‌లో ‘మా’ సభ్యులను లంచ్‌కు ఆహ్వానించారు ప్రకాష్ రాజ్. రెండు మూడు రోజుల్లో మంచు విష్ణు ప్యానెల్‌ను ఎనౌన్స్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘మా’ సభ్యులను ప్రసన్నం చేసుకొనే పనిలో బిజీగా ఉన్నారు ‘మా’ అధ్యక్ష అభ్యర్థులు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు..

Bandla Ganesh : ఎప్పుడు ఏం మాట్లాడాలో నేర్చుకోండి.. వివరణ ఇచ్చిన వీకే నరేష్

ఇదిలా ఉంటే.. ‘మా’ సభ్యులకు ప్రకాష్‌ రాజ్‌ విందు ఏర్పాటు చెయ్యడంపై బండ్ల గణేష్‌ కౌంటర్‌ ఇచ్చారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో దయచేసి ‘మా’ కళాకారులకు విందులు, సన్మానాలు చేయొద్దు.. కరోనా కాలంలో విందుల పేరిట జీవితాలతో చెలగాటాలాడొద్దు.. ఓట్లు కావాలంటే అభివృద్ధి పనులు మాత్రమే చెప్పండి’ అంటూ వీడియో షేర్ చేశారు బండ్ల గణేష్..