Maadhav Mr Idiot Movie Song Released
Mr Idiot Song : మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ ‘మిస్టర్ ఇడియట్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. JJR ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో నిర్మాత JJR రవిచంద్ నిర్మాణంలో గౌరీ రోణంకి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో సిమ్రాన్ శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.
Also Read : Devara : బాక్సాఫీస్ వద్ద దేవర దూకుడు.. వారం రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
ఇప్పటికే ‘మిస్టర్ ఇడియట్’ ట్రైలర్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా నుంచి ‘కాంతార కాంతార..’ అనే లిరికల్ సాంగ్ ని విడుదల చేసారు. హీరో నిఖిల్ ఈ సాంగ్ ని రిలీజ్ చేసారు. కాసర్ల శ్యామ్ ఈ పాటకు లిరిక్స్ రాయగా అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వంతో రాహుల్ సిప్లిగంజ్ ఈ సాంగ్ ని పాడారు. కాలేజీలో హీరోయిన్ ని హీరో టీజ్ చేసే సందర్భంలో ఈ సాంగ్ వస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాని నవంబర్ లో రిలీజ్ చేయనున్నారు.
ఫుల్ ఎనర్జిటిక్ గా ఉన్న ఈ పాట మీరు కూడా వినేయండి..