Maaman Streaming on ZEE5 from today available telugu and kannada also
Maaman: సూరి, ఐశ్వర్య లక్ష్మీ జంటగా నటించిన చిత్రం మామన్(Maaman). ప్రశాంత్ పాండియరాజన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. లార్క్ స్టూడియోస్ పతాకంపై కె.కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజ్‌కిరణ్, గీతా కైలాసం, విజి చంద్రశేఖర్, నిఖిలా శంకర్, బాల శరవణన్, బాబా భాస్కర్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆగస్టు 8 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE 5లో ఇన్నాళ్లు తమిళంలో మాత్రమే అందుబాటులో ఉంది. తాజాగా నేటి (ఆగస్టు 27) నుంచి తెలుగుతో పాటు కన్నడ బాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది.
Shah Rukh Khan : తను కొన్న కార్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని.. షారుఖ్, దీపికాలపై కేసు నమోదు..
కథ ఏంటంటే..?
తమిళనాడులోని తిరుచ్చి ప్రాంతంలో ఇన్బా, గిరిజ నివసిస్తుంటారు. వీరిద్దరు అక్కా తమ్ముళ్లు. తన అక్కంటే ఇన్బాకు ఎంతో ప్రేమ. అయితే.. గిరిజకు చాన్నాళ్ల తరువాత లేక లేక ఓ బిడ్డ పుడతాడు. మేనల్లుడి ముద్దుగా లడ్డూ అని ఇన్భా పిలుస్తూ ఉంటాడు. అల్లుడిని అపురూపంగా చూసుకుంటాడు. ఇన్బా.. రేఖను పెళ్లి చేసుకుంటాడు. లడ్డూ వీళ్తతో ఉండడం రేఖకు నచ్చదు. ఈ క్రమంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది. లడ్డూ వల్ల ఇన్బా, రేఖ విడిపోతారా? వంటి విషయాలు తెలియాలంటే మామన్‌ను చూడాల్సిందే.