×
Ad

Raja Raja Chora : రాజ పరాక్రమ.. మహా పరిక్రమ, త్రివిక్రమ.. విచ్చేస్తున్నారహో..

యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ మూవీ.. ‘రాజ రాజ చోర’..

  • Published On : August 12, 2021 / 12:40 PM IST

Raja Raja Chora

Raja Raja Chora: హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా డిఫరెంట్ సినిమాలు, అంతే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ.. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ మూవీ.. ‘రాజ రాజ చోర’.. మేఘా ఆకాశ్‌, సునయన హీరోయిన్లు. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌‌ని హసిత్‌గోలి డైరెక్ట్ చేశారు..

Raja Raja Chora : దొంగకు కూడా రవ్వంత గుర్తింపు కావాలి.. ‘చోర గాథ’ అదిరిపోయిందిగా..

పీపుల్స్‌మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌పతాకాలపై టి.జి.విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌నిర్మించారు. వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాతగా.. కీర్తి చౌదరి క్రియేటివ్‌ప్రొడ్యూసర్‌‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్ ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలు పెంచాయి. గురువారం ‘మాయ మాయ’ అనే బ్యూటిఫుల్ సాంగ్ వదిలారు. వివేక్ సాగర్ ట్యూన్, సానాపతి భరధ్వాజ్ పాత్రుడు లిరిక్స్, అనురాగ్ కులకర్ణి వాయిస్ పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి.

Meher Ramesh : నేను కథ చెప్పినప్పుడల్లా.. సూపర్‌స్టార్ ‘ఛీ’ కొడుతూనే ఉంటారు..

తనికెళ్ల భరణి, గంగవ్వ, అజయ్ ఘోష్, కాదంబరి కిరణ్, శ్రీకాంత్‌ అయ్యంగార్ తదితరులు నటించిన ఫన్ రైడర్ ‘రాజ రాజ చోర’ తో శ్రీ విష్ణు ఆగస్టు 18న థియేటర్లలలో నవ్వులు పూయించనున్నాడు. ఇటీవల ఓటీటీలో రిలీజ్ చేసిన ‘గాలిసంపత్’ నిరాశ పరచడంతో తిరిగి ట్రాక్‌లోకి రావడానికి అవసరమయ్యే హిట్ ‘రాజ రాజ చోర’ ఇస్తుందనే ధీమాతో ఉన్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు.