Naga Vamsi : జాతి రత్నాలు కంటే ఒక్క శాతం తక్కువ నవ్వినా టికెట్ డబ్బులు రిటన్ ఇచ్చేస్తా.. ఎన్టీఆర్ బామ్మర్ది సినిమా.. నిర్మాత ఛాలెంజ్..

తాజాగా మ్యాడ్(MAD) అనే ఓ సినిమా రాబోతుంది. జూనియర్ ఎన్టీఆర్(NTR) బామ్మర్ది నార్నె నితిన్(Narne Nithiin) ముఖ్య పాత్రలో, పలువురు కొత్తవాళ్లతో తెరకెక్కిన సినిమా మ్యాడ్.

MAD Movie Producer Naga Vamsi Challenge for NTR Brother in Law Movie MAD over Jathi Ratnalu

Naga Vamsi :  కొన్ని సినిమాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఇటీవల కాలంలో అలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తున్నాయి. కరోనా అయిన తర్వాత వచ్చిన సినిమాల్లో జాతి రత్నాలు(Jathi Ratnalu) చిన్న సినిమాగా రిలీజయి అందర్నీ నవ్వించి భారీ విజయం సాధించింది. ఆ సినిమాలో నటించిన వారందరికి, డైరెక్టర్ కి కూడా మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది జాతి రత్నాలు సినిమా.

తాజాగా మ్యాడ్(MAD) అనే ఓ సినిమా రాబోతుంది. జూనియర్ ఎన్టీఆర్(NTR) బామ్మర్ది నార్నె నితిన్(Narne Nithiin) ముఖ్య పాత్రలో, పలువురు కొత్తవాళ్లతో తెరకెక్కిన సినిమా మ్యాడ్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ లో మ్యాడ్ సినిమాని డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తెరకెక్కించాడు. ఇటీవల ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ చేశారు. మ్యాడ్ సినిమా అక్టోబర్ 6న రిలీజ్ కాబోతుంది.

Also Read : Salaar Vs Dunki : ప్రభాస్ ‘సలార్’ వర్సెస్ షారుఖ్ ‘డుంకి’.. మీమ్స్‌తో ఆడేసుకుంటున్న అభిమానులు, నెటిజన్లు.. మీరు చూశారా?

తాజాగా ఈ సినిమా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఈవెంట్ నిర్వహించగా సినిమా నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఈవెంట్ కి జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ కూడా రాగా అనుదీప్ స్టేజిపై మాట్లాడిన తర్వాత నిర్మాత నాగవంశీ అనుదీప్ తో.. మీ జాతిరత్నాలు సినిమా కంటే ఒక్క శాతం ఈ సినిమా చూసి తక్కువ నవ్వామని ఎవరన్నా చెప్తే వాళ్లకి టికెట్ డబ్బులు రిటన్ ఇచ్చేస్తాను అని అన్నారు. అదే మాట ఆడియన్స్ కి కూడా చెప్తూ.. మ్యాడ్ సినిమా చూసి జాతిరత్నాలు కంటే ఒక్క శాతం తక్కువ నవ్వినా నాకు ట్విట్టర్ లో మెసేజ్ పెట్టండి, మీ టికెట్ డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తాను అని చెప్పాడు నాగవంశీ. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి నాగవంశీకి ఎవరన్నా ఆడియన్స్ మెసేజ్ చేస్తారేమో చూడాలి.