Mad Square : ‘టిల్లు స్క్వేర్’ అయిపోయింది.. నెక్స్ట్ ‘మ్యాడ్ స్క్వేర్’.. మరో కామెడీ సీక్వెల్..

గత కొంతకాలంగా మ్యాడ్ సినిమాకు సీక్వెల్ రాబోతుందని వార్తలు వస్తున్నాయి.

Mad Movie Sequel Mad Square Movie Announced Pooja Happening Today

Mad Square Movie : నార్నె నితిన్ (Narne Nithiin), సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరి ప్రియా, అనంతిక, గోపిక మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన ‘మ్యాడ్’ సినిమా గత సంవత్సరం అక్టోబర్ 6న థియేటర్స్ లో రిలీజయి భారీ విజయం సాధించింది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ లో తెరకెక్కిన మ్యాడ్ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులని మెప్పించింది.

కేవలం మూడు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన మ్యాడ్ సినిమా ఏకంగా 10 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. గత కొంతకాలంగా మ్యాడ్ సినిమాకు సీక్వెల్ రాబోతుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా నేడు మ్యాడ్ సినిమా సీక్వెల్ ఓపెనింగ్ పూజా కార్యక్రమం జరిగింది. మళ్ళీ అదే దర్శకుడు, అదే కాస్ట్ తో, మరికొంతమంది కొత్త వాళ్ళని కూడా తీసుకొని మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ గా తెరకెక్కనుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వనుంది.

Also Read : Pawan Kalyan – Sai Dharam Tej : పదేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమా.. సాయి ధరమ్ తేజ్ చేయాల్సి వచ్చింది..

ఇటీవలే సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి డీజే టిల్లు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ వచ్చి ఏకంగా 100 కోట్ల హిట్ కొట్టింది. ఇప్పుడు అదే నిర్మాణ సంస్థ నుంచి మ్యాడ్ సినిమా సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ అనౌన్స్ చేయడంతో ఈ సినిమాపై కూడా ఇప్పట్నుంచే అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ మ్యాడ్ స్క్వేర్ ఏ రేంజ్ లో నవ్విస్తుందో చూడాలి.