Madhavan : అరుదైన ఘనతని సాధించిన మాధవన్ తనయుడు.. స్విమ్మింగ్ లో 7 పతకాలు..

హీరో మాధవన్ తనయుడు వేదాంత్‌ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 16 ఏళ్ల వేదాంత్ 7 జాతీయ పతకాలని గెలుచుకొని అరుదైన ఘనత సాధించాడు. ఇటీవల బెంగుళూరులో 47వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్

Madhavan

Madhavan :  హీరో మాధవన్ తనయుడు వేదాంత్‌ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 16 ఏళ్ల వేదాంత్ 7 జాతీయ పతకాలని గెలుచుకొని అరుదైన ఘనత సాధించాడు. ఇటీవల బెంగుళూరులో 47వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్ జరిగింది. ఈ ఛాంపియన్ షిప్ లో దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి చాలా మంది స్విమ్మర్స్ పాల్గొన్నారు. ఈ చాంపియన్ షిప్ లో వేదాంత్ మొత్తం ఏడు పతకాలను గెలుచుకున్నాడు. ఈ పోటీలో వేదాంత్‌ మహారాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం వహించాడు. ఈ జూనియర్ నేషనల్ అక్వాటిక్ ఛాంపియన్ షిప్ లో వేదాంత్‌ నాలుగు రజత పతకాలతో పాటు మూడు కాంస్య పతకాలు సాధించాడు.

Manchu Vishnu : హీరోయిన్స్ పై పిచ్చి పిచ్చి థంబ్‌నైల్స్‌ పెడితే ఊరుకోను.. యూట్యూబ్ ఛానల్స్ కి మంచు విష్ణు హెచ్చరిక

అతి చిన్న వయసులోనే వేదాంత్‌ సాధించిన ఘనతను ప్రశంసిస్తూ రాజ్యసభ ఎంపీ అభిషేక్‌ మను సింఘ్వీ ఓ ట్వీట్‌ చేశారు. మాధవన్‌ తన తనయుడు వేదాంత్‌తో కలిసి ఉన్న ఫొటోను ట్వీట్‌ చేస్తూ ‘గుడ్‌ జాబ్‌ వేదాంత్‌. నువ్వు దేశం గర్వించేలా చేశావు. నిన్ను చూసి గర్వపడుతున్నాం. అలాగే నీ పెంపకం చూసి కూడా’ అంటూ మాధవన్‌పై కూడా ప్రశంసలు కురిపించారు.

Bigg Boss 5 : ఈ సారి నామినేషన్ లో ఉన్నది ఎవరెవరు??

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వేదాంత్ ని ఆర్యన్ ని పోలుస్తూ కామెంట్లు చేస్తున్నారు. 16 ఏళ్ళకి వేదాంత్ ఇలా పతకాలని సాధిస్తుంటే షారుఖ్ కుమారుడు ఆర్యన్ 17 ఏళ్ళ వయసులో డ్రగ్స్ కేసులో చిక్కుకున్నాడని, వేదాంత్ ని చూసి ఆర్యన్ చాలా నేర్చుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.