Bigg Boss 5 : ఈ సారి నామినేషన్ లో ఉన్నది ఎవరెవరు??
బిగ్‌బాస్ ఈసారి నామినేషన్స్ డిఫరెంట్‌గా నిర్వహించాడు. కంటెస్టెంట్లకు వారి ప్రియమైనవారు లేఖలు పంపించారని చెప్పాడు. కానీ ఆ లేఖలు దక్కాలంటే మాత్రం ఒకరి నామినేషన్ మరొకరిపై ఆధారపడేలా

Bigg Boss 5 : ఈ సారి బిగ్ బాస్ 5వ సీజన్ చాలా రసవత్తరంగా సాగుతుంది. ఎక్కువగా కంటెస్టెంట్స్ గొడవలు పడుతున్నారు. కెప్టెన్సీ టాస్క్ కోసం, నామినేషన్స్ రోజు ఈ గొడవలు మరీ ఎక్కువగా ఉంటున్నాయి. బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు కూడా కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెట్టేలా ఉంటాయి. కానీ ఈ సారి నామినేషన్స్ ఎలాంటి గొడవలు లేకుండా సాగాయి. గొడవల స్థానంలో సభ్యుల ఏడుపులు వచ్చాయి.
Bandla Ganesh : ఆ స్వామిజి బయోపిక్ నేనే తీస్తా : బండ్ల గణేష్
బిగ్‌బాస్ ఈసారి నామినేషన్స్ డిఫరెంట్‌గా నిర్వహించాడు. కంటెస్టెంట్లకు వారి ప్రియమైనవారు లేఖలు పంపించారని చెప్పాడు. కానీ ఆ లేఖలు దక్కాలంటే మాత్రం ఒకరి నామినేషన్ మరొకరిపై ఆధారపడేలా చేశాడు. ఎవరికి లెటర్స్ ఇవ్వాలి? ఎవరికి ఇవ్వకూడదు? అనేది మీలో మీరే నిర్ణయించుకోండంటూ హౌస్‌మేట్స్ ఇష్టానికి వదిలేశాడు. కానీ ఎవరికైతే లెటర్ దక్కదో వారు ఎలిమినేషన్ కి నామినేట్ అవుతారని ప్రకటించాడు. దీంతో ఆ లేఖలు చదవాలని కంటెస్టెంట్స్ కి ఉంది. కానీ వేరే వాళ్ళు ఆ లెటర్ ఇవ్వకపోతే ఏడ్చేశారు.
Varudu Kavalenu : ఊళ్ళో పెళ్ళిళ్ళని సినిమా ప్రమోషన్ల కోసం వాడిన నాగశౌర్య
ప్రియాంకకు తల్లిదండ్రుల నుంచి లెటర్ రాగా దాన్ని చించేయొద్దని కోరింది. ఇక రవి, లోబోలలో ఒకరికే లెటర్ అందుకునే అవకాశం ఉండటంతో లోబో… రవితో నీ పాప గుర్తుగా ఒక బొమ్మ, మీ వైఫ్ గుర్తుగా ఒక లేఖ ఉంది, కానీ నాకు అది కూడా లేదంటూ తాను లెటర్ తీసుకుంటానన్నాడు. మరి రవి ఇచ్చాడో లేదో తెలియదు. ఇక విశ్వ సిరికి మధ్యలో కూడా ఇలాగే రావడంతో సిరి.. విశ్వ కోసం తన లెటర్‌ను త్యాగం చేసి ఏడ్చేసింది. దీంతో విశ్వ కృతజ్ఞతతో ఆమెకు చేతులెత్తి దండం పెట్టి ఏడుస్తూ హాగ్ ఇచ్చాడు. యానీ మాస్టర్ తన ఫ్యామిలీని తలుచుకుని ఏడ్చేసింది. షణ్ముఖ్ కూడా ఏడ్చేశాడు. లెటర్ చదవలేకపోవడంతో అమ్మా… నువ్వు క్యాన్సర్‌ను జయించావు, అమ్మమ్మ చనిపోయినప్పుడు కూడా ధైర్యంగా ఉన్నావు. నువ్వే నా ఇన్‌స్పిరేషన్. నేనూ ఈ బాధను భరిస్తాను అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయాడు.
Samantha : మరోసారి సమంత కేసుని విచారించిన కోర్టు.. తీర్పు??
ఇదంతా ప్రోమోలోనే చూపించారు. ఈ ప్రోమో ప్రకారం చూసుకుంటే సిరి, శ్రీరామ్, షణ్ముఖ్, రవి, మానస్ లు నామినేషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే లోబో లెటర్ కూడా చింపేశారని లోబో కూడా ఎలిమినేషన్ లో ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఈ వారం ఎలిమినేషన్ కి ఆరుగురు నామినేట్ అయ్యారని తెలుస్తుంది. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. ప్రతి వారం గొడవలతో జరిగే నామినేషన్స్ ఈ వారం ఇలా ఎమోషనల్ గా సాగడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.