Mahavatar Narsimha : సరికొత్త రికార్డ్ సృష్టించిన మహావతార్ నరసింహ.. 6 కోట్లతో తీస్తే ఏకంగా.. ఆ లిస్ట్ లో ఫస్ట్ సినిమా..

సైలెంట్ గా రిలీజయిన మహావతార్ నరసింహ రెండో రోజు నుంచి మౌత్ టాక్ తోనే దూసుకుపోయింది.

Mahavatar Narsimha

Mahavatar Narsimha : ఇటీవల రిలీజయిన యానిమేషన్ సినిమా మహావతార్ నరసింహ అందర్నీ మెప్పించి భారీ హిట్ అయిన సంగతి తెలిసిందే. హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మాణంలో అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 25న థియేటర్స్ లో రిలీజయి దూసుకుపోతుంది.

తెలుగులో ఈ సినిమా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేసారు. యానిమేషన్ సినిమా అయినా, భక్తి సినిమా అయినా ఒక పవర్ ఫుల్ కమర్షియల్ సినిమా చూసిన అనుభవం ఇచ్చారు. సినిమా చివరి అరగంట అయితే ప్రతి షాట్ కి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. సైలెంట్ గా రిలీజయిన మహావతార్ నరసింహ రెండో రోజు నుంచి మౌత్ టాక్ తోనే దూసుకుపోయింది. ఈ సినిమా థియేటర్స్ లో ఇంకా ఆడుతుంది.

Also Read : Kingdom : ‘కింగ్డమ్’కి ముందు అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా? చెప్పేసిన డైరెక్టర్.. రామాయణం నుంచి..

నిన్నే ఈ సినిమాకు తెలుగులో కూడా సక్సెస్ మీట్ నిర్వహిచారు. మహావతార్ నరసింహ సినిమా కేవలం 6 కోట్లతో తెరకెక్కించగా ఇప్పటివరకు ఏకంగా 105 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఇంకా దూసుకుపోతుంది. ఈ కలెక్షన్స్ తో అత్యధిక కలెక్షన్స్, 100 కోట్లు రాబట్టిన మొదటి ఇండియన్ యానిమేటెడ్ సినిమాగా సరికొత్త రికార్డ్ సెట్ చేసింది మహావతార్ నరసింహ. ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.

 

Also Read : Producer SKN : పేరుకే వినోద పరిశ్రమ.. నిర్మాతల శ్రమ విషాదమే.. టాలీవుడ్ సమ్మెపై నిర్మాత SKN పోస్ట్ వైరల్..