Kingdom : ‘కింగ్డమ్’కి ముందు అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా? చెప్పేసిన డైరెక్టర్.. రామాయణం నుంచి..

కింగ్డమ్ సినిమాకు ముందు అనుకున్న టైటిల్స్ వేరని తెలిపాడు.

Kingdom : ‘కింగ్డమ్’కి ముందు అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా? చెప్పేసిన డైరెక్టర్.. రామాయణం నుంచి..

kingdom

Updated On : August 4, 2025 / 11:47 AM IST

Kingdom : విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా ఇటీవల జులై 31న థియేటర్స్ లో రిలీజయి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే ఈ సినిమా 75 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తాజాగా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.

ఈ క్రమంలో కింగ్డమ్ సినిమాకు ముందు అనుకున్న టైటిల్స్ వేరని తెలిపాడు.

Also Read : Producer SKN : పేరుకే వినోద పరిశ్రమ.. నిర్మాతల శ్రమ విషాదమే.. టాలీవుడ్ సమ్మెపై నిర్మాత SKN పోస్ట్ వైరల్..

గౌతమ్ మాట్లాడుతూ.. కింగ్డమ్ సినిమాకు మొదట్లో యుద్ధకాండ అనే టైటిల్ అనుకున్నాం. కథలో హీరో శ్రీలంకకి వెళ్లి అక్కడ పోరాటం చేస్తాడు. రామాయణంలో రాముడు శ్రీలంకకు వెళ్లి పోరాటం చేసేది యుద్ధకాండ కాబట్టి ఆ టైటిల్ అనుకున్నాం. తర్వాత దేవర నాయక అనే టైటిల్ కూడా పరిశీలించాం. కానీ ఎన్టీఆర్ గారి దేవర సినిమా రావడంతో ఆ టైటిల్ కూడా విరమించుకున్నాము. సినిమా మొదలయ్యాక కింగ్డమ్ టైటిల్ అనుకున్నాము. ఇదైతే అన్ని భాషల్లో ఒకే టైటిల్ ఉంటుంది, అందరికి కనెక్ట్ అవుతుంది. కానీ హిందీలో ఈ టైటిల్ కాపీ రైట్స్ వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి. దీంతో హిందీలో సామ్రాజ్య అనే టైటిల్ తో రిలీజ్ చేసాము అని తెలిపాడు.

Also Read : Pawan Kalyan : ఉస్తాద్ భగత్ సింగ్ లాస్ట్ డే షూటింగ్.. పవన్ ని కలవాలని ఫిలిం ఫెడరేషన్ నాయకుల నిరసన.. పోలీస్ బందోబస్త్..