Pawan Kalyan : ఉస్తాద్ భగత్ సింగ్ లాస్ట్ డే షూటింగ్.. పవన్ ని కలవాలని ఫిలిం ఫెడరేషన్ నాయకుల నిరసన.. పోలీస్ బందోబస్త్..
పవన్ కళ్యాణ్ తన రాజకీయ బిజీ మధ్య సినిమాలకు డేట్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే.

Pawan Kalyan
Pawan Kalyan : ఫిలిం ఫెడరేషన్ నాయకులు సినీ కార్మికులను ఇవాళ్టి నుంచి షూటింగ్స్ కి వెళ్ళొద్దని, 30 శాతం వేతనాలు పెంచితే తప్ప షూటింగ్స్ కి వెళ్ళొద్దని ఆదేశాలు జారీ చేసారు. ఫిలిం చాంబర్ తో చర్చలు సఫలం అవ్వకపోవడంతో ఫిలిం ఫెడరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో టాలీవుడ్ లో నేటి నుంచి షూటింగ్స్ నిలిచిపోయాయి.
అయితే పవన్ కళ్యాణ్ తన రాజకీయ బిజీ మధ్య సినిమాలకు డేట్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. ఇవాళ ఒక్కరోజు షూటింగ్ చేస్తే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన పార్ట్ పూర్తయిపోతుంది. ఇక్కడ టాలీవుడ్ లో సమ్మె జరుగుతుండటంతో చెన్నై నుంచి పలువురు సాంకేతిక నిపుణులను తెచ్చుకొని షూటింగ్ చేస్తున్నారు.
Also Read : Kiran abbavaram : కిరణ్ అబ్బవరం కొడుకు పేరు ఏంటో తెలుసా? తిరుమలలో నామకరణం..
ఈ క్రమంలో పలువురు ఫిలిం ఫెడరేషన్ నాయకులు అన్నపూర్ణ స్టూడియో వద్ద నిరసన వ్యక్తం చేసారు. అలాగే పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు ఫెడరేషన్ నాయకులు ప్రయత్నం చేసారు. 30% వేతనాల పెంపు విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని ఫిలిం ఫెడరేషన్ వ్యక్తులు అన్నపూర్ణ స్టూడియో బయట ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ హడావిడి నెలకొనడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసారు.
మరి ఈ విషయం పవన్ కళ్యాణ్ కి తెలుస్తుందా? పవన్ ఫిలిం ఫెడరేషన్ నాయకులను కలుస్తారా చూడాలి. ఇక ఈ సమ్మెపై టాలీవుడ్ నిర్మాతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఒకరిద్దరు నిర్మాతలు ట్విట్టర్ వేదికగా బహిరంగంగానే దీనిపై విమర్శలు చేసారు.
Also Read : Telugu Film Chamber of Commerce : నిర్మాతలకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక సూచన..