Kiran abbavaram : కిర‌ణ్ అబ్బ‌వ‌రం కొడుకు పేరు ఏంటో తెలుసా? తిరుమ‌ల‌లో నామ‌క‌ర‌ణం..

టాలీవుడ్ యువ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, న‌టి ర‌హ‌స్య దంప‌తుల‌కు కొద్ది రోజుల క్రితం కుమారుడు జ‌న్మించిన సంగ‌తి తెలిసిందే.

Kiran abbavaram : కిర‌ణ్ అబ్బ‌వ‌రం కొడుకు పేరు ఏంటో తెలుసా? తిరుమ‌ల‌లో నామ‌క‌ర‌ణం..

Do you know Kiran abbavaram son name

Updated On : August 4, 2025 / 9:44 AM IST

టాలీవుడ్ యువ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, న‌టి ర‌హ‌స్య దంప‌తుల‌కు కొద్ది రోజుల క్రితం కుమారుడు జ‌న్మించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా బాబుతో క‌లిసి కిర‌ణ్ అబ్బ‌వ‌రం దంప‌తులు తిరుమల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. తిరుమ‌ల‌లో బాబుకు నామ‌క‌ర‌ణం చేసేందుకు వ‌చ్చిన‌ట్లు తెలిపారు.

తొలిసారి బాబుతో శ్రీవేంక‌టేశ్వ‌ర‌స్వామి వారిని ద‌ర్శించుకోవ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని కిర‌ణ్ అబ్బ‌వ‌రం చెప్పుకొచ్చారు. త‌మ కుమారుడికి హ‌ను అబ్బ‌వ‌రం అని పేరు పెట్టామ‌ని తెలిపాడు. శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగిందన్నారు.

Telugu Film Chamber of Commerce : నిర్మాత‌ల‌కు తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ కీల‌క సూచ‌న‌..

ఇక తాను న‌టిస్తున్న సినిమాల‌కు సంబంధించిన విష‌యాల‌ను పంచుకున్నాడు. కే ర్యాంప్, చెన్నై లవ్ స్టోరీ ల షూటింగ్ జ‌రుగుతోంద‌న్నాడు. ఈ నెల‌లో మ‌రో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుంద‌న్నాడు.