Mahendragiri Varahi OTT : ఓటీటీలోకి మహేంద్రగిరి వారాహి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సుమంత్ నటించిన మహేంద్రగిరి వారాహి మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ (Mahendragiri Varahi OTT) ఫిక్సైంది.
- Thota Vamshi Kumar
- Published on- October 1, 2026 / 09:23 PM IST
Mahendragiri Varahi Movie ott streaming on october 2nd
Mahendragiri Varahi OTT : సుమంత్ నటించిన తాజా చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఐశ్వర్య రాజేష్, సిద్దు జొన్నలగడ్డ, వెన్నెల కిషోర్, మీనాక్షి గోస్వామి, బ్రహ్మానందం, మంజు భార్గవి, వంశీ చాగంటి, కమల్ కామరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనను దక్కించుకుంది.
Pujita Ponnada : చారల డ్రెస్‌లో తెలుగు నటి.. పూజితా పొన్నాడ ఫోటోలు..
ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా ? అని ఎదురు చూస్తున్న వారికి శుభవార్త ఇది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబర్ 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది.
