Mahesh Babu: రాజమౌళి సినిమాలో శ్రీరాముడిగా మహేశ్‌ బాబు?

ఆ సీన్లను షూట్ చేయడం కోసం హైదరాబాద్‌లో వార‌ణాసి సెట్‌ వేస్తున్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న సినిమాలో సూపర్ స్టార్ మ‌హేశ్‌ బాబు రాముడి అవతారంలో కనిపించబోతున్నట్లుగా టాక్ వినబడుతోంది. మ‌హేశ్‌ బాబు- రాజ‌మౌళి కాంబోలో రూపుదిద్దుకొంటున్న సినిమా క‌థ‌కీ, రామాయ‌ణానికీ ప‌రోక్షంగా ఓ లింక్ ఉందంటున్నారు. ఈ మూవీలో ఓ సంద‌ర్భంలో మ‌హేశ్‌ రాముడి అవ‌తారంలో క‌నిపించ‌బోతున్నాడ‌ట‌.

ఆ సీన్లను షూట్ చేయడం కోసం హైదరాబాద్‌లో వార‌ణాసి సెట్‌ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మహేశ్‌ బాబు రాముడిగా కనిపించబోతున్నాడనే వార్త బయటికి వచ్చిందో..ఫ్యాన్స్ ఖుష్‌ అవుతున్నారు. ఎవరికి నచ్చిన విధంగా వారు మహేశ్‌ బాబును రాముని అవతారంలో రెడీ చేసి ఫొటోలు షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా రాముని అవతారంలో ఉన్న మహేష్ బాబు ఏఐ ఇమేజెస్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

యాక్షన్‌ అడ్వెంచర్‌గా మహేశ్‌, రాజమౌళి సినిమాను త్వరలోనే పట్టాలెక్కించనున్నారు. ఇప్పుడు మూవీ యూనిట్‌ దృష్టి అంతా ప్రీ ప్రొడక్షన్‌ పనులపైనే ఉంది. రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోందని టాక్‌. ఈ ప్రాజెక్ట్‌ కోసం రాజమౌళి ఏఐ టెక్నాలజీని కూడా వాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ మూవీలో పలువురు విదేశీ నటులు యాక్ట్ చేయబోతున్నారట. ఇండియన్ లాంగ్వేజెస్‌తో పాటు విదేశీ భాషల్లోనూ ఈ మూవీ రిలీజ్‌కు ప్లాన్ జరుగుతుందంటున్నారు. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవ‌రి చివ‌రి వారం నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుందని టాక్. దాంతో శ్రీరాముడిగా మహేశ్‌ ఎలా అలరిస్తాడోనని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

Zebra Trailer Launch Event : మెగాస్టార్ గెస్ట్ గా.. సత్యదేవ్ జీబ్రా ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. ఫొటోలు చూశారా..?