సూపర్ స్టార్ మహేష్ బాబు మరో కొత్త బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టబోతున్నాడు..
కొత్త వ్యాపారంలోకి మహేష్..
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో పాటు దేశంలోని పలు పెద్ద బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల ఏఎంబీ సినిమాస్, హంబుల్ డ్రెసెస్‌లో పార్ట్‌నర్ అయిన మహేశ్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌తో నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే.
వీటితో పాటు ఈయన మరో కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారనే వార్త వినబడుతోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు మహేశ్ పెర్‌ఫ్యూమ్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారని వినికిడి.
మరో బ్రాండ్‌కి సైన్ చేసిన మహేష్..
ఇదిలా ఉంటే ఇప్పటికే పలు బ్రాండ్లను ప్రమోట్ చేసిన మహేష్ తాజాగా ఆన్ లైన్‌లో కార్ల విక్రయంతో పాటు కొనుగోలు చేసే ‘కార్ దేఖో’ (Car Dekho) పోర్టల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా సంతకం చేశాడు. ఆల్ రెడీ మహేష్ మరో 22 ఇతర బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్నాడు.
See Also | ‘వస్తున్నా.. వచ్చేస్తున్నా.. వద్దంటే వదిలేస్తానా’..