Mahesh Babu : మహేష్ జాబితాలోకి మరో ఖరీదైన కారు..

ఇటీవల ఖరీదైన కార్లని తయారు చేసే ఆడి సంస్థ ట్రోన్ అనే ఎలక్ట్రిక్ కార్ ని లాంచ్ చేసింది. ఈ కార్ ని లాంచ్ చేసిన కొద్ది రోజులకే మహేష్ బాబు ఈ కార్ ని బుక్ చేసుకున్నాడు. తాజాగా.....

Mahesh

 

Mahesh Babu :  మన స్టార్ సెలబ్రిటీలు ఖరీదైన కార్లని మెయింటైన్ చేస్తారు. కొంతమంది స్టార్స్ మార్కెట్ లోకి వచ్చే కార్ నచ్చితే కొనేసి తమ జాబితాలో చేర్చుకుంటారు. ఇలా కార్లని కొనేస్తూ ఉంటారు స్టార్లు. చాల మంది టాలీవుడ్ స్టార్ హీరోల దగ్గర ఖరీదైన కార్ల కలెక్షన్స్ బాగానే ఉంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు మరో కొత్త కారుని కొన్నాడు. అయితే ఈ సారి ఎలక్రిక్ వెహికల్ ని కొన్నాడు మహేష్.

 

ఇటీవల ఖరీదైన కార్లని తయారు చేసే ఆడి సంస్థ ట్రోన్ అనే ఎలక్ట్రిక్ కార్ ని లాంచ్ చేసింది. ఈ కార్ ని లాంచ్ చేసిన కొద్ది రోజులకే మహేష్ బాబు ఈ కార్ ని బుక్ చేసుకున్నాడు. తాజాగా ఏప్రిల్‌ 16న ఇవాళ మహేశ్‌బాబుకి ఆడి ఇండియా హెడ్ కారుని హ్యాండోవర్‌ చేశారు. ఈ ఆడి ట్రోన్‌ కారు ధర దాదాపు ఒక కోటి 20 లక్షల వరకు ఉంటుందని సమాచారం. దీనిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 480 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయొచ్చు.

Beast – KGF 2 : 50 కోట్లు వర్సెస్ 50 లక్షలు.. ‘కేజిఎఫ్ 2’ దెబ్బకి చతికిలపడిన బీస్ట్..

ఈ కొత్త కార్ తో మహేష్ బాబు ఫోటో దిగి తన సోషల్ మీడియాలో అధికారికంగా పోస్ట్ చేశాడు. దీనికి ఆడి ఇండియాని కూడా ట్యాగ్ చేశాడు. కార్ తో మహేష్ ఉన్న ఫోటోని షేర్ చేసి.. ”క్లీన్, గ్రీన్ మరియు స్థిరమైన భవిష్యత్తుని ఇంటికి తీసుకొచ్చాను. ఈ ఆడి కారుని నడపడం కోసం చాలా ఎగ్జైట్ గా ఫీల్ అవుతున్నాను” అని పోస్ట్ చేశారు. మహేష్ బాబు ఈ కార్ కి ప్రమోషన్స్ కూడా చేశారు. దీంతో మహేష్ కొత్త కారుని అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.