Beast – KGF 2 : 50 కోట్లు వర్సెస్ 50 లక్షలు.. ‘కేజిఎఫ్ 2’ దెబ్బకి చతికిలపడిన బీస్ట్..

బీస్ట్ విడుదలైన తర్వాతి రోజే 'కేజిఎఫ్ 2' విడుదల కావడంతో 'కేజిఎఫ్ 2' దెబ్బకి అన్ని ప్రాంతాల్లో బీస్ట్ చతికిలపడింది. తమిళనాడు తప్ప మిగిలిన ప్రాంతాలలో చాలా థియేటర్స్ లో బీస్ట్ ని.....

Beast – KGF 2 : 50 కోట్లు వర్సెస్ 50 లక్షలు.. ‘కేజిఎఫ్ 2’ దెబ్బకి చతికిలపడిన బీస్ట్..

Kgf2

Bollywood :  ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాలు పోటీ పడుతున్నాయి. తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన బీస్ట్, కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన కేజిఎఫ్ 2 సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి వెంటవెంటనే రిలీజ్ అయ్యాయి. ఏప్రిల్ 13న బీస్ట్ రిలీజ్ అవ్వగా, ఏప్రిల్ 14న కేజిఎఫ్ 2 రిలీజ్ అయింది. రెండు సినిమాలని భారీగానే ప్రమోషన్ చేశారు. చెప్పాలంటే కేజిఎఫ్ 2 కంటే బీస్ట్ ని ఎక్కువే ప్రమోట్ చేశారు. ఎప్పుడూ లేనిది విజయ్ కూడా ఈ సారి ప్రమోషన్స్ లో ఎక్కువగా పాల్గొన్నారు.

ముందు నుంచి తమిళనాడులో బీస్ట్ డామినేషన్ ఉన్నా దేశం మొత్తం మాత్రం ‘కేజిఎఫ్ 2’ డామినేషన్ ఉంటుంది అని అంతా భావించారు. ఇప్పుడు అదే జరిగింది. బీస్ట్ మొదటి రోజే భారీ నెగిటివ్ టాక్ ని తెచ్చుకుంది. సినిమా తమిళనాడులో తప్ప వేరే రాష్ట్రాల్లో ప్లాప్ టాక్ ని తెచ్చుకుంది. తమిళనాడులో కూడా బీస్ట్ యావరేజ్ టాక్ ని తెచ్చుకుంది. కాకపోతే స్టార్ హీరో సినిమా అవడంతో కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి మొదటిరోజు. బీస్ట్ విడుదలైన తర్వాతి రోజే ‘కేజిఎఫ్ 2’ విడుదల కావడంతో ‘కేజిఎఫ్ 2’ దెబ్బకి అన్ని ప్రాంతాల్లో బీస్ట్ చతికిలపడింది.

KGF2 : రెండు రోజుల్లో 240 కోట్లు.. అదరగొడుతున్న యశ్..

తమిళనాడు తప్ప మిగిలిన ప్రాంతాలలో చాలా థియేటర్స్ లో బీస్ట్ ని తీసి పక్కనపెట్టేశారు. ఇక బాలీవుడ్ లో అయితే బీస్ట్ ని ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కలెక్షన్ల పరంగా చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే బాలీవుడ్ లో ‘కేజిఎఫ్ 2’ సినిమా మొదటి రోజు 54 కోట్లు కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకు ఏ బాలీవుడ్ సినిమా కూడా అక్కడ అంత కలెక్ట్ చేయలేదు. దీంతో బాలీవుడ్ వర్గాలు షాక్ అయ్యారు. ఇక విజయ్ బీస్ట్ సినిమా బాలీవుడ్ లో మొదటి రోజు కేవలం 50 లక్షలు మాత్రమే కలెక్షన్లని సాధించింది.

Bharathi Singh : బాబు పుట్టిన 10 రోజులకే ఇంట్లో వదిలేసి షూటింగ్‌కి వెళ్లిపోయిన యాంకర్

దీంతో ఇప్పుడు అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ముందు నుంచి అందరూ అనుకున్నదే అయింది అని భావిస్తున్నారు. కానీ మరీ ఇంత వ్యత్యాసం ఉంటుందని ఎవరూ ఊహించలేదు. దాదాపు 100 రేట్లు బీస్ట్ కంటే ‘కేజిఎఫ్ 2’ కి కలెక్షన్స్ ఎక్కువరావడంతో యశ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుంటే ఓ పక్కన సినిమా కూడా పోయిందనే బాధలో ఉన్న విజయ్ అభిమానులు ఇది తెలుసుకొని మరింత నిరాశ చెందుతున్నారు. 50 లక్షలకి 50 కోట్లకి అసలు పోటీనే లేదు, బీస్ట్ ‘కేజిఎఫ్ 2’ సినిమాకి అసలు పోటీనే కాదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అసలు హిందీలో బీస్ట్ రిలీజ్ చేయకుండా ఉంటే బాగుండు అని విజయ్ అభిమానులు భావిస్తున్నారు.