Bharathi Singh : బాబు పుట్టిన 10 రోజులకే ఇంట్లో వదిలేసి షూటింగ్‌కి వెళ్లిపోయిన యాంకర్

తాజాగా బిడ్డ పుట్టిన 12 రోజులకే భారతీ సింగ్ ముంబైలో ఓ ప్రోగ్రాం కోసం స్టూడియోలో ప్రత్యక్షమైంది. దీంతో ఆమె మీడియా కంట పడగా ఆమెపై అప్పుడే షూటింగ్ కి వచ్చేశారు ఏంటి అంటూ ప్రశ్నలు....

Bharathi Singh : బాబు పుట్టిన 10 రోజులకే ఇంట్లో వదిలేసి షూటింగ్‌కి వెళ్లిపోయిన యాంకర్

Bharathi Singh

Bharathi Singh :  బాలీవుడ్ స్టార్ కమెడియన్స్ లో ఒకరు భారతి సింగ్. ఖత్రా.. ఖత్రా.. ఖత్రా, కపిల్ శర్మ షో, హమ్ తుమ్ ఔర్ క్వారంటైన్,ఇండియా బెస్ట్ డాన్సర్ షోలతో యాంకర్‌గా, కమెడియన్‌గా భారతి బాగా పాపులర్ అయింది. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కమెడియన్‌గా మెప్పించింది. భారతి సింగ్, హార్ష్‌ లింబచియాను 2017 డిసెంబర్‌లో గోవాలో వివాహం చేసుకుంది. గతేడాది డిసెంబర్‌లో తాము తల్లి తండ్రులు కాబోతున్నామంటూ ప్రకటించారు. ఇటీవలే భారతి సింగ్ ఒక బాబుకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపారు ఈ జంట. బాలీవుడ్ ప్రముఖులు, నెటిజన్లు అంతా వీరికి శుభాకాంక్షలు తెలియచేశారు.

Prabhas : ట్రాఫిక్ నిభందనలు ఉల్లంఘించిన ప్రభాస్.. ఫైన్ వేసిన పోలీసులు..

తాజాగా బిడ్డ పుట్టిన 12 రోజులకే భారతీ సింగ్ ముంబైలో ఓ ప్రోగ్రాం కోసం స్టూడియోలో ప్రత్యక్షమైంది. దీంతో ఆమె మీడియా కంట పడగా ఆమెపై అప్పుడే షూటింగ్ కి వచ్చేశారు ఏంటి అంటూ ప్రశ్నలు కురిపించారు. దీంతో భారతి మీడియాతో మాట్లాడుతూ.. ”నా బిడ్డకు ఇప్పుడు 12 రోజులు. కానీ వదిలి రావాల్సి వచ్చింది. ఇవాళ నా బాబుని వదిలి వచ్చేటప్పుడు చాలా ఏడ్చాను. కానీ పని పనే కదా, తప్పదు, వర్క్ కమిట్మెంట్స్ ఉన్నాయి” అంటూ తెలిపింది. బిడ్డ పుట్టిన 10 రోజులకే లేచి బయటకి వచ్చి షూటింగ్ లో పాల్గొనడం అంటే మామూలు విషయం కాదు. దీంతో తన డెడికేషన్‌ని అంతా అభినందిస్తున్నారు.