Prabhas : ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన ప్రభాస్.. ఫైన్ వేసిన పోలీసులు

గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు కార్ విండోలకి బ్లాక్ ఫిలింలు తీసెయ్యాలి అంటూ వచ్చిన ఆదేశాలతో ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. కారు అద్దాలకు.......

Prabhas : ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన ప్రభాస్.. ఫైన్ వేసిన పోలీసులు

Prabhas Car

Prabhas : గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు కార్ విండోలకి బ్లాక్ ఫిలింలు తీసెయ్యాలి అంటూ వచ్చిన ఆదేశాలతో ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం అమర్చుకొని వెళ్తున్న వాహనదారులను ఆపి మరీ జరిమానాలు విధిస్తూ, అద్దాలకు ఉన్న బ్లాక్‌ ఫిలింలను తొలగిస్తున్నారు పోలీసులు. సాధారణంగా సెలబ్రిటీలంతా తమ కార్లకి కచ్చితంగా బ్లాక్ ఫిలింలు అమరుస్తారు. మన దగ్గర చాలా మంది సెలబ్రిటీలు తమ కార్లకి ఈ బ్లాక్ ఫిలింలు వాడతారు. దీంతో హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించే సోదాల్లో చాలా మంది సెలబ్రిటీలు, స్టార్లు పట్టుబడుతున్నారు.

Acharya : ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి జగన్.. పవన్ అభిమానులు ఆగుతారా?

ఇప్పటికే ఎన్టీఆర్, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్, మంచు మనోజ్, త్రివిక్రమ్, నాగ చైతన్య.. లాంటి పలువురి కార్లను ఆపి వారి కార్లకి ఉన్న బ్లాక్ ఫిలింలని తొలగించి జరిమానాలు విధించారు పోలీసులు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కారుకు చలాన్ విధించారు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు. ప్రభాస్ కి సంబంధించిన కార్ కి ఎంపీ స్టిక్కర్ ఉన్న నంబర్ ప్లేట్, విండోలకి బ్లాక్ ఫిలింస్ ఉండటంతో 1450 రూపాయలు జరిమానా విధించారు పోలీసులు. అయితే ఈ సమయంలో కార్ లో ప్రభాస్ లేరని తెలిపారు పోలీసులు.