Mahesh Babu : వారణాసి కంటే ముందే మీడియా ముందుకు మహేష్ బాబు.. ఎందుకంటే..?

త్వరలోనే మహేష్ బాబు మీడియా ముందుకు రాబోతున్నారు. (Mahesh Babu)

  • Published on- June 24, 2026 / 01:03 PM IST

Mahesh Babu

Mahesh Babu : మహేష్ బాబు మీడియా ముందుకు, అభిమానుల ముందుకు చాలా తక్కువగా వస్తారని తెలిసిందే. తన సినిమాల ప్రమోషన్స్ లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి లేదా ఒకటి రెండు సార్లు కనిపిస్తారు. ప్రస్తుతం మహేష్ రాజమౌళితో వారణాసి సినిమా చేస్తున్నారు. ఆ సినిమా 2027 లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఎప్పుడో గుంటూరు కారం ఈవెంట్లో అభిమానుల ముందుకు వచ్చి మాట్లాడారు మహేష్. మళ్ళీ వారణాసి రిలీజ్ సమయం వరకు బయటకొచ్చి మాట్లాడరు అనుకున్నారు అంతా.

అయితే త్వరలోనే మహేష్ బాబు మీడియా ముందుకు రాబోతున్నారు. మహేష్ GMB సినిమాస్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో మేజర్ సినిమా నిర్మించి ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఇప్పుడు మహేష్ వేరే నిర్మాతలతో కలిసి సత్యదేవ్ హీరోగా రావు బహ్రదూర్ సినిమాని నిర్మించారు. ఈ సినిమా జులై 3న రిలీజ్ కాబోతుంది.

Also See : Rajamouli : వార‌ణాసి సెట్‌లో ఎంఎంఏ ఫైట‌ర్‌తో రాజ‌మౌళి

నేడు ఈ సినిమా నిర్మాత గోపాలకృష్ణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మహేష్ బాబు ఈ సినిమా చూసారు. ఆయనకు సినిమా బాగా నచ్చింది. ముఖ్యంగా మేకింగ్ గురించి, సినిమాలో విజువల్స్, షాట్స్ గురించి మాట్లాడారు. నమ్రత గారే పిలిచి మాకు ఈ సినిమా చేయమని వాళ్ళ కొలాబరేషన్ లో ఇచ్చారు. మహేష్ బాబు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి లేదా సక్సెస్ ఈవెంట్ కి వస్తారు. ప్రస్తుతం మహేష్ ఫారిన్ లో ఉన్నారు. రిలీజ్ లోపు వస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చే అవకాశం ఉంది. రాకపోతే తర్వాత సక్సెస్ మీట్ కి అయినా వస్తారు అని తెలిపారు.

దీంతో త్వరలోనే మహేష్ బాబు సత్యదేవ్ రావు బహదూర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదా సక్సెస్ మీట్ కి వచ్చి అభిమానులకు కనిపించబోతున్నారు అని తెలుస్తుంది. ఫ్యాన్స్ కూడా మహేష్ రావాలని కోరుకుంటున్నారు.