Mahesh Babu : ఫ్యాన్స్ దిల్ ఖుష్ చెయ్యబోతున్న మహేష్ బాబు..
అభిమానుల ఎదురు చూపులకు ఇప్పుడు వడ్డీతో కలిపి సాలిడ్ ట్రీట్ ప్లాన్ చేసాడు సూపర్‌స్టార్ మహేష్ బాబు..
- sekhar
- Published on- January 31, 2022 / 04:25 PM IST
Ssmb
Mahesh Babu: ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత ఇప్పటివరకు సూపర్‌స్టార్ మహేష్ బాబుని స్క్రీన్ మీద చూడలేకపోయామని ఫ్యాన్స్ తెగ ఫీలయిపోతున్నారు. అప్పుడప్పుడు మహేష్, నమ్రత పిల్లలతో కలిసి ఉన్న పిక్స్ షేర్ చేసినప్పుడు తప్ప ఏ సినిమా ఫంక్షన్లోనూ ఫ్యాన్స్‌కి కనిపించలేదాయన.
SSMB 28 : మహేష్ సినిమాకి ముహూర్తం ఫిక్స్..
అభిమానుల ఎదురు చూపులకు ఇప్పుడు వడ్డీతో కలిపి సాలిడ్ ట్రీట్ ప్లాన్ చేసాడు. ఒకటి, రెండు కాదు.. ముచ్చటగా మూడు అప్డేట్లతో ఫ్యాన్స్ దిల్ ఖుష్ చెయ్యబోతున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించబోయే 28వ మూవీకి ఫిబ్రవరి 3న ముహూర్తం ఫిక్స్ చేశారు. మహేష్ కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత మహేష్ అటెండ్ అయ్యే ఫస్ట్ సినిమా ఫంక్షన్ ఇదే కావడంతో ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
SSMB 28 : మహేష్ సినిమాకి ముహూర్తం ఫిక్స్..
ఫిబ్రవరి 4న నటసింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘ఆహా’ పాపులర్ అండ్ క్రేజీ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ కి సూపర్‌స్టార్ గెస్ట్‌గా వచ్చిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఇది 10వ ఎపిసోడ్. మహేష్ ఎపిసోడ్‌తో ఫస్ట్ సీజన్ కంప్లీట్ కానుంది.
మహేష్, కీర్తి సురేష్ జంటగా.. పరశురామ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘సర్కారు వారి పాట’.. GMB ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. సంక్రాంతికి రావల్సిన సినిమా పోస్ట్ పోన్ అయి, ఏప్రిల్ 1కి వస్తుందని చెప్పారు కానీ మళ్లీ వాయిదా పడనుంది. వాలంటైన్స్ డే కానుకగా ‘సర్కారు వారి పాట’ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చెయ్యబోతున్నారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ తెగ హ్యాపీగా ఫీలవుతున్నారు.
Mahesh-Namrata : ‘హ్యాపీ బర్త్‌డే NSG.. నువ్వే నా ఎనర్జీ’.. నమ్రతకి మహేష్ విషెస్..
