Mahesh Babu : యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనిల్ కపూర్‌తో కలిసి మహేష్ బాబు డాన్స్..
యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పోకిరి సినిమాలోని 'డొలె డొలె' సాంగ్ కి అనిల్ కపూర్‌తో కలిసి మహేష్ బాబు, రణబీర్, బాబీ డియోల్ డాన్స్ వేసి అదరగొట్టారు.
- gum 95921
- Published On : November 27, 2023 / 09:25 PM IST
Mahesh Babu dance with Anil Kapoor Ranbir Kapoor at Animal Pre release event
Mahesh Babu : సందీప్ వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించిన ‘యానిమల్’ మూవీ రిలీజ్ కి సిద్దమవుతుంది. డిసెంబర్ 1న ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ అండర్ వరల్డ్ డాన్ మూవీ నుంచి ఇటీవల ట్రైలర్ రిలీజ్ అయ్యి భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నేడు హైదరాబాద్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కండక్ట్ చేశారు. ఈ ఈవెంట్ కి రణబీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక మందన్న, బాబీ డియోల్ తో పాటు చీఫ్ గెస్టులుగా మహేష్ బాబు, రాజమౌళి కూడా విచ్చేశారు.
ఇక ఈ ఈవెంట్ లో అనిల్ కపూర్, మహేష్ బాబుతో డాన్స్ వేయించారు. అనిల్ కపూర్ ని ఏదైనా ఒక స్టెప్ వేయమని ఆడియన్స్ కోరగా, ఆయన ఓకే చెప్పి మహేష్ బాబు పాటని వేయమని చెప్పారు. అయితే తనతో పాటు డాన్స్ వేయడానికి మహేష్ అండ్ రణబీర్ ని కూడా వేదిక మీదకి రావాలని కోరారు. మహేష్ బాబు మొదటిలో వేదిక మీదకి రావడానికి కొంచెం మొహమాటం చూపించారు. అనిల్ కపూర్ మాట్లాడుతూ.. “నేను ఒక సీనియర్ గా ఆదేశిస్తున్నాను మీరు స్టేజి పైకి రండి” అని చెప్పడంతో మహేష్ వేదిక మీదకి వచ్చారు.
Also read : HariHara VeeraMallu : యానిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ‘హరిహర వీరమల్లు’లో డైలాగ్ లీక్ చేసిన బాబీ డియోల్..
ఇక వేదిక పై పోకిరి సినిమాలోని ‘డొలె డొలె’ సాంగ్ వేశారు. ఆ పాట హుక్ స్టెప్ ని మహేష్ బాబు అలా వేసి మైమరపించారు. అనిల్ కపూర్, బాబీ డియోల్, రణబీర్ మహేష్ తో కలిసి కూడా పాటకు స్టెప్ వేశారు. గతంలో ‘సర్కారు వారి పాట’ మూవీ సక్సెస్ ఈవెంట్ లో మహేష్ డాన్స్ వేసి అందర్నీ సర్‌ప్రైజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇలా వేదిక పై డాన్స్ వేసి ఫ్యాన్స్ ని ఖుషీ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
