Hari Hara Veera Mallu : యానిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ‘హరిహర వీరమల్లు’ డైలాగ్ లీక్ చేసిన బాబీ డియోల్..

యానిమల్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' చిత్రంలో తాను చెప్పిన డైలాగ్ లీక్ చేసిన బాబీ డియోల్.

Hari Hara Veera Mallu : యానిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ‘హరిహర వీరమల్లు’ డైలాగ్ లీక్ చేసిన బాబీ డియోల్..

Bobby Deol leaks Pawan Kalyan HariHara VeeraMallu movie dialogue

Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి యోధుడిగా కనిపిస్తూ చేస్తున్న సినిమా ‘హరిహరవీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ యాక్టర్స్ బాబీ డియోల్, నోరా ఫతేహి.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. AM రత్నం నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం బ్రేక్ లు పడ్డాయి. ఎలక్షన్స్ హడావుడి పూర్తి అయిన తరువాత ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా ఈ మూవీలోని ఒక డైలాగ్ ని బాబీ డియోల్ లీక్ చేశారు.

సందీప్ వంగా డైరెక్ట్ చేస్తున్న ‘యానిమల్’ మూవీలో బాబీ డియోల్ విలన్ గా చేస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరుగుతుంది. ఈ ఈవెంట్ కి రణబీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక మందన్న, బాబీ డియోల్ తో పాటు చీఫ్ గెస్టులుగా మహేష్ బాబు, రాజమౌళి కూడా విచ్చేశారు. ఇక ఈ ఈవెంట్ లో బాబీ డియోల్ మాట్లాడుతూ.. “నేను తెలుగులో ఒక మూవీలో నటిస్తున్నాను. అది ఏ సినిమానో మీకు చెప్పనవసరం లేదు. ఆ మూవీలో చెప్పిన ఒక డైలాగ్ మీ కోసం చెబుతాను” అంటూ తెలియజేశారు.

Also read : Mahesh Babu : మహేష్ బాబు మూవీ టైటిల్ చెప్పిన సందీప్ వంగా.. ఆ సినిమాలో హీరో క్యారెక్టర్..

ఇంతకీ ఆ డైలాగ్ ఏంటంటే.. “పాశ్య బేగం మా ప్రాణం. ఆ ప్రాణం నువ్వు కాపాడావు. మీకు ఏం కావాలో కోరుకోమని ఆదేశిస్తున్నాను”. ఈ డైలాగ్ పవన్ కళ్యాణ్ తో చెప్పేదే అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ డైలాగ్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమా మెసేజ్ ఓరియంటెడ్ గా ఉండబోతుంది. కమర్షియల్ ఫిలింగా మాత్రమే కాకుండా ఇండియా కల్చర్ ని డెవలప్ చేసేలా వీరమల్లు ఉంటుందని నిర్మాతలు తెలియజేశారు. ఆల్రెడీ 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మిగిలిన షూటింగ్ ని పూర్తి చేయడానికి త్వరలో సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్దమవుతుంది.