×
Ad

Sitara Ghattamaneni : అనాధ పిల్లలతో కలిసి గుంటూరు కారం సినిమా చూసిన సితార.. పొగిడేస్తున్న అభిమానులు..

చీర్స్ ఫౌండేషన్ కి చెందిన పలువురు అనాధ పిల్లలతో కలిసి సితార హైదరాబాద్ AMB సినిమాస్ లో గుంటూరు కారం(Guntur Kaaram) సినిమా చూసింది.

  • Published On : January 21, 2024 / 12:30 PM IST

Mahesh Babu Daughter Sitara Ghattamaneni Watched Guntur Kaaram Movie with Orphan Kids in AMB Cinemas

Sitara Ghattamaneni : మహేష్ బాబు(Mahesh Babu) కూతురిగా సితార అందరికి పరిచయమైనా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, ఎప్పటికప్పుడూ ఫోటోలు, పలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతుంది. చిన్న ఏజ్ లోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, ఫాలోవర్స్ ని కూడా సంపాదించుకుంటుంది.

ఇక తండ్రి మహేష్ బాటలోనే పలు సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి అభినందనలు పొందుతుంది. ఇప్పటికే సైకిళ్ళ పంపిణి, తన యాడ్ రెమ్యునరేషన్ ఛారిటీకి ఇవ్వడం.. లాంటి మంచి పనులు చేసిన సితారా తాజాగా మరో మంచి పని చేసింది. చీర్స్ ఫౌండేషన్ కి చెందిన పలువురు అనాధ పిల్లలతో కలిసి సితార హైదరాబాద్ AMB సినిమాస్ లో గుంటూరు కారం(Guntur Kaaram) సినిమా చూసింది. మహేష్ బాబు ఫౌండేషన్ తరపున వారి కోసం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసింది. అనంతరం ఆ పిల్లలతో కాసేపు సరదాగా ముచ్చటించింది.

Also Read : Sitara Ghattamaneni : గుంటూరు కారం పాటకి సితార పాప డ్యాన్స్ చూసారా?

ప్రస్తుతం సితార ఆ పిల్లలతో కలిసి సినిమా చూసిన ఫొటోలు వైరల్ గా మారాయి. దీంతో మహేష్ అభిమానులు, నెటిజన్లు మరోసారి సితారని అభినందిస్తున్నారు. ఇక ఇటీవలే సితార గుంటూరు కారం సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొంది. ఆ సినిమా నుంచి ఓ పాటకి డ్యాన్స్ కూడా చేసింది. రిలీజ్ రోజే తన ఫ్యామిలీతో కలిసి సుదర్శన్ థియేటర్లో సినిమా కూడా చూసింది సితార.