Sitara Ghattamaneni : గుంటూరు కారం పాటకి సితార పాప డ్యాన్స్ చూసారా?
సితార పాప సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె చలాకీతనం చూసి మహేష్ బాబు అభిమానులు తండ్రికి తగ్గ తనయ అని మురిసిపోతుంటారు. తాజాగా 'గుంటూరు కారం' సినిమాలోని పాటకు సితార వేసిన స్టెప్పులు వైరల్ అవుతున్నాయి.

Sitara Ghattamaneni
Sitara Ghattamaneni : సూపర్ స్టార్ మహేష్ బాబు డాటర్ సితార ఘట్టమనేనికి సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంది. సితార పాప పోస్టులు చూస్తుంటే తండ్రికి తగ్గ తనయురాలు అనిపిస్తూ ఉంటుంది. రీసెంట్‌గా ‘గుంటూరు కారం’ సినిమాలోని పాటకి సితార వేసిన స్టెప్పులు చూసి మహేష్ బాబు అభిమానులు ముచ్చటపడుతున్నారు.
మహేష్-నమ్రతల గారాలాపట్టి సితార పాప సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. డ్యాన్స్ నేర్చుకుంటూ డ్యాన్స్ వీడియోలు షేర్ చేస్తుంటుంది. తన యాక్టివ్ నెస్ చూస్తుంటే భవిష్యత్‌లో హీరోయిగా మంచి పేరు తెచ్చుకుంటుందని అనిపిస్తూ ఉంటుంది. తన వీడియోలు చూసి మహేష్ అభిమానులు వావ్ అంటుంటారు. రీసెంట్‌గా ‘గుంటూరు కారం’ సినిమాలోని ‘ట్రిప్పింగ్..ట్రిప్పింగ్’ పాటకి సితార వేసిన స్టెప్పులు అదరహో అనిపిస్తున్నాయి.
Sitara Ghattamaneni : అనాధ పిల్లలతో కలిసి గుంటూరు కారం సినిమా చూసిన సితార.. పొగిడేస్తున్న అభిమానులు..
ఇటీవల మహేష్ ఇంట్లో జరిగిన ‘గుంటూరు కారం’ సక్సెస్ పార్టీలో కూడా సితార స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. టీమ్ అందరితో సందడి చేసింది. చాలా చిన్న వయసులోనే యూ ట్యూబ్ ఛానల్ రన్ చేయడంతో పాటు ఓ జ్యయలరీ సంస్ధకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన సితార ఇంతవరకు ఏ స్టార్ కిండ్ అందుకోని బంపర్ ఆఫర్ అందుకుంది. సితార లేటెస్ట్ వీడియోలో స్టెప్పులు చూసిన మహేష్ అభిమానులు.. లైక్ ఫాదర్.. లైక్ డాటర్ అని.. సితార యూ ఆర్ సో అడోరబుల్ అంటూ అభినందనలు కురిపిస్తున్నారు.
Also Read : ఈ నటి డైట్ సీక్రెట్ బాగుందే.. 9 ఏళ్లుగా ఏం మారలేదు…
View this post on Instagram