Seerat Kapoor : ఈ నటి డైట్ సీక్రెట్ బాగుందే.. 9 ఏళ్లుగా ఏం మారలేదు…

'రన్ రాజా రన్' ఫేమ్ సీరత్ కపూర్ గుర్తున్నారా? ఆ సినిమాలో ఎలా ఉన్నారో.. ఇప్పటికీ అలాగే ఉన్నారు.. ఈ నటి డైట్ సీక్రెట్స్ ఏంటో తెలుసా?

Seerat Kapoor : ఈ నటి డైట్ సీక్రెట్ బాగుందే.. 9 ఏళ్లుగా ఏం మారలేదు…

Seerat Kapoor

Updated On : January 20, 2024 / 7:04 PM IST

Seerat Kapoor : 2014లో వచ్చిన ‘రన్ రాజా రన్’ తో కెరియర్ మొదలుపెట్టిన నటి సీరత్ కపూర్ అప్పుడు ఎలా ఉన్నారో.. ఇప్పుడు అచ్చంగా అలాగే ఉన్నారు. తన గ్లామర్ ఏ మాత్రం తగ్గకుండా ఎంతో స్లిమ్‌గా కనిపిస్తున్న ఆ నటి డైట్ సీక్రెట్ ఏంటో చెప్పారు.

Syamala Devi : ప్రభాస్ జాతకం ఆయనకెలా తెలుసు?.. ప్రభాస్ పెద్దమ్మ కామెంట్స్..

సీరత్ కపూర్ మోడల్‌గా, కొరియోగ్రాఫర్‌గా కెరియర్ మొదలుపెట్టి 2014లో వచ్చిన ‘రన్ రాజా రన్’ సినిమాతో హీరోయిన్‌గా మారారు. ఆ తర్వాత వరుసగా టైగర్, కొలంబస్, రాజు గారి గది, టచ్ చేసి చూడు, ఒక్క క్షణం, మా వింత గాధ వినుమా వంటి సినిమాల్లో నటించారు. అయితే ఈ బ్యూటి ‘రన్ రాజా రన్’ మూవీ టైమ్‌లో ఎలా ఉన్నారో ఇప్పటికే అలాగే ఉన్నారు. చక్కని ఫిజిక్ మెయిన్‌ టెయిన్ చేస్తున్న సీరత్ కపూర్ డైట్ సీక్రెట్ ఏంటో ఈ మధ్య షేర్ చేసుకున్నారు.

Vijay Devarakonda : ప్రభాస్ కల్కి సినిమాలో విజయ్ దేవరకొండ గెస్ట్ అప్పీరెన్స్..? ఆ స్టార్ హీరో, డైరెక్టర్ కూడా..

సీరత్‌ని చూస్తే విపరీతంగా డైటింగ్ చేస్తారని అనుకుంటారు. తను అసలు డైటింగ్ చేయరట. స్వీట్స్, చాక్లెట్స్ బాగా తింటారట. ఇటాలియన్ ఫుడ్ అంటే మరింత ఇష్టమట. మనం ఎంత తినాలో మన బాడీ చెబుతుంది అంటున్న సీరత్ ఏది తిన్నా చాలా లిమిట్‌గా తింటారట. ఎప్పుడైనా కాస్త ఎక్కువ తినేసాను అనిపిస్తే జిమ్ ట్రైనర్ సూచనలు పాటిస్తారట. ఉదయం లేవగానే వేడి నీళ్లలో నిమ్మకాయ రసం, తేనె కలుపుకుని తాగుతారట. షూటింగ్స్ ఉన్నా సరే ఇంట్లో ఫుడ్ తినడం.. షూటింగ్ అవ్వగానే ఇంటికి రావడం సీరత్ కపూర్‌కి అలవాటట. చాలామంది హీరోయిన్లు షూటింగ్‌లలో బ్రేక్ దొరికితే విదేశాలకు విహార యాత్రలంటూ చెక్కేస్తూ ఉంటారు. సీరత్ కపూర్ మాత్రం ఎక్కువగా హిమాలయాలకు వెళ్తారట. ఇన్ని మంచి అలవాట్లుంటే స్లిమ్‌గా ఉండరా? ఏంటి? అనిపిస్తోంది కదా.

 

View this post on Instagram

 

A post shared by Seerat Kapoor (@iamseeratkapoor)