Syamala Devi : ప్రభాస్ జాతకం ఆయనకెలా తెలుసు?.. ప్రభాస్ పెద్దమ్మ కామెంట్స్..

రెబల్ స్టార్ కృష్ణంరాజు జయంతి సందర్భంగా ఆయన సతీమణి శ్యామలాదేవి మీడియాతో మాట్లాడారు. తన భర్త జ్ఞాపకాలతో పాటు ప్రభాస్ గురించి మాట్లాడారు.

Syamala Devi : ప్రభాస్ జాతకం ఆయనకెలా తెలుసు?.. ప్రభాస్ పెద్దమ్మ కామెంట్స్..

Syamala Devi

Syamala Devi : రెబల్ స్టార్ కృష్ణంరాజు జయంతి సందర్భంగా ఆయన సతీమణి శ్యామలాదేవి మీడియాతో మాట్లాడారు. భర్త జ్ఞాపకాలతో పాటు ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసారు. ముఖ్యంగా ప్రభాస్ గురించి జ్యోతిష్యులు వేణు స్వామి చేసిన కామెంట్స్‌పై ఆమె ఎమోషనల్ అయ్యారు.

Game On Trailer : ‘గేమ్‌ ఆన్’ ట్రైలర్ రిలీజ్.. అన్న హీరో.. తమ్ముడు డైరెక్టర్‌గా సినిమా

జనవరి 20 రెబల్ స్టార్ కృష్ణంరాజు జయంతి. ఈ సందర్భంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సతీమణి శ్యామలాదేవి మాట్లాడారు. కృష్ణంరాజు లేరన్న విషయాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని ఆ విషాదం నుండి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నానని ఆమె చెప్పారు. ప్రభాస్, పిల్లలు ఇస్తున్న ధైర్యమే అందుకు కారణమని అన్నారు. ఇటీవల కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌లో తమ కుటుంబంపై వస్తున్న ట్రోల్స్ బాధ కలిగిస్తున్నాయని శ్యామలాదేవి అన్నారు. ముఖ్యంగా కృష్ణంరాజు కుటుంబానికి, ప్రభాస్ కుటుంబానికి పడటం లేదని రాయడం వల్ల ఎటువంటి లాభం ఉంటుందో అని పేర్కొన్నారు. ఇటీవల ప్రభాస్ ఆరోగ్యం గురించి జ్యోతిష్యులు వేణుస్వామి చేసిన కామెంట్స్ చూసానని అవి ఎంతగానో బాధించాయని శ్యామలాదేవి అన్నారు. ప్రభాస్ జాతకం తన మదర్‌కి మాత్రమే తెలుసునని.. వేణుస్వామికి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. వేణుస్వామి వ్యాఖ్యలు పట్టించుకోవద్దని ప్రభాస్ అభిమానులకు సూచించినట్లు శ్యామలాదేవి మాట్లాడారు.

గతంలో వేణుస్వామి ప్రభాస్ పెళ్లి గురించి, సినిమాల గురించి తన కెరియర్ గురించి మీడియా ఇంటర్వ్యూల్లో కామెంట్స్ చేసారు. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడ్డారు. తాజా ఇంటర్వ్యూ ద్వారా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి వేణుస్వామికి గట్టి సమాధానం ఇచ్చినట్లైంది. కాగా ప్రభాస్ రీసెంట్ మూవీ సలార్ సూపర్ హిట్ అయ్యింది. కల్కి 2898 AD, రాజా సాబ్, సలార్ 2 తో పాటు కొన్ని ప్రాజెక్టులు చేస్తూ ప్రభాస్ బిజీగా ఉన్నారు.