Game On Trailer : ‘గేమ్‌ ఆన్’ ట్రైలర్ రిలీజ్.. అన్న హీరో.. తమ్ముడు డైరెక్టర్‌గా సినిమా

తాజాగా గేమ్‌ ఆన్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది.

Game On Trailer : ‘గేమ్‌ ఆన్’ ట్రైలర్ రిలీజ్.. అన్న హీరో.. తమ్ముడు డైరెక్టర్‌గా సినిమా

Geetanand Neha Solanki Game On Trailer Released

Game On Trailer : గీతానంద్‌, నేహా సోలంకి(Neha Solanki) హీరోహీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా ‘గేమ్‌ ఆన్’. దయానంద్ దర్శకత్వంలో సైకలాజికల్ గేమ్ కథతో తెరకెక్కుతున్న థ్రిల్లింగ్ స్టోరీ. ఈ సినిమాలో సీనియర్ నటి మధుబాల, ఆదిత్య మీనన్‌, శుభలేఖ సుధాకర్, కిరీటి కీలక పాత్రలు పోషిస్తున్నారు. క‌స్తూరి క్రియేష‌న్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై ఈ సినిమాని ర‌వి క‌స్తూరి నిర్మించారు.

తాజాగా గేమ్‌ ఆన్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో గ్రాండ్ గా జరిగింది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఓ గేమింగ్ కంపెనీలో పనిచేసే కుర్రాడికి ఓ రియల్ గేమ్ ఎదురైతే అతని లైఫ్ లో ఏం జరిగింది అనే కథాంశంతో గేమ్‌ ఆన్ తెరకెక్కబోతుంది. సినిమాలో ఫుల్ యాక్షన్, రొమాన్స్ ఉండబోతుందని ట్రైలర్ చూస్తేనే తెలిసి పోతుంది. ఇక ఈ గేమ్‌ ఆన్ సినిమా ఫిబ్ర‌వ‌రి 2న గ్రాండ్ గా విడుద‌ల‌ కానుంది. ఈ సినిమా హీరో, దర్శకులు ఇద్దరూ సొంత అన్నదమ్ములు కావడం విశేషం.

గేమ్‌ ఆన్ ట్రైలర్ లాంచ్ అనంతరం చిత్రయూనిట్ మీడియాతో మాట్లాడింది. ఈ నేపథ్యంలో నిర్మాత ర‌వి క‌స్తూరి మాట్లాడుతూ… ఇది నా మొదటి సినిమా. నేను ఆస్ట్రేలియాలో ఉంటాను. గీతానంద్ నా క్లాస్మేట్. చిన్నప్పట్నుంచి ఏదో ఒక రోజు సినిమా తీద్దామని అనుకున్నాం. అది ఇప్పుడు ఇలా వర్కౌట్ అయింది. ప్రతి విషయంలో క్వాలిటీ ఉండేలా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీసాం సినిమాని. ఇలాంటి కథ ఇప్పటివరకు తెలుగులో అయితే రాలేదు అని అన్నారు.

Also See : Neha Solanki : నెలవంకలా మెరుస్తున్న నేహా సోలంకి..

దర్శకుడు దయానంద్‌ మాట్లాడుతూ.. కమర్షియల్ సినిమాని రా అండ్ రస్టిక్ గా తీశాను. నేను పూరి జగన్నాథ్ కి హార్డ్ కోర్ ఫ్యాన్ ని. ఈ సినిమాలో పాత్రలన్నీ గ్రే షేడ్‌లో ఉంటాయి. చచ్చిపోదామనుకునే ఓ వ్యక్తి రియల్‌ టైమ్ సైక‌లాజిక‌ల్ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు? గేమ్‌లో టాస్క్‌ను ఎలా తీసుకున్నాడు? అసలు ఆ గేమ్‌ ఏంటి? ఎవరు ఆడిస్తున్నారు? అనే అంశాలతో ఈ సినిమా చాలా ఆసక్తిగా తీసాము. హీరో గీతానంద్ మా అన్నయ్య చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ చేశాడు. ఇది రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాకపోయినా ఫ్యామిలీ డార్క్ ఎమోషన్స్ ఉంటాయి అని తెలిపారు.

Geetanand Neha Solanki Game On Trailer Released

హీరో గీతానంద్ మాట్లాడుతూ.. మీరు ట్రైలర్ లో చూసింది 10 శాతం మాత్రమే. ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేసి మంచి కాన్సెప్ట్ రాసుకుని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించాం. గేమ్‌ ఆన్ ఒక హై ఆక్టేన్ యాక్షన్ డ్రామా. మేము సినిమా తీసి గేమ్ స్టార్ట్ చేసాం. మా గేమ్ ను ప్రేక్షకులే గెలిపించాలి. ఈ సినిమా తర్వాత మా తమ్ముడు డైరెక్టర్ దయానంద్ యాక్షన్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకుంటాడు అని అన్నారు.