Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్‌కు కరోనా పాజిటివ్

సూపర్ స్టార్ మహేష్ బాబు కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్నీ మహేష్ స్వయంగా సోషల్ మీడియాలో అకౌంట్ లో పోస్టు చేసి వెల్లడించారు. గతంలో వచ్చిన రెండో వేవ్ లలోనూ...

Mahesh Babu

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని మహేష్ తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు. గతంలో వచ్చిన రెండో వేవ్ లలోనూ షూటింగ్ లకు దూరంగా ఉన్నాడు మహేశ్. ఆ టైంలో కరోనాను దరిచేరనీయలేదు. ఇటీవల మోకాలి ట్రీట్మెంట్ కు ఫారిన్ టూర్ కు వెళ్లి వచ్చిన సూపర్ స్టార్ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండిపోయారు.

తనకు చాలా తేలిక పాటి లక్షణాలు ఉన్నాయని అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మహేశ్ బాబు ట్విట్టర్ లో తెలిపారు. కొద్ది రోజులుగా కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ కు వెళ్లాలని, హాస్పిటలైజ్ కాకుండా ఉండాలంటే వ్యాక్సిన్ తీసుకుని ఎవరిని వారు కాపాడుకోవాలని సూచించారు.

గురువారం మంచు లక్ష్మీప్రసన్నకు కూడా కొవిడ్ పాజిటివ్ అని తెలిసింది. సాధారణ జలుబు మాదిరిగా కరోనా మనల్ని వచ్చి చేరుతుందని, దానిని తట్టుకునేలా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని, విటమిన్ టాబ్లెట్స్ ను తీసుకోవాలని సలహా ఇచ్చారు లక్ష్మీ ప్రసన్న. దాదాపు రెండు సంవత్సరాలుగా కరోనా బారి పడకుండా తప్పించుకున్నానని, ఆ దోబూచులాటలో చివరకు ఇప్పుడు దాని చేతికి చిక్కిపోయానని మంచు లక్ష్మీ తెలిపారు.

ఇది కూడా చదవండి: అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు నేత చీరలు అందించిన కేటీఆర్

గతేడాది డిసెంబర్ చివరి వారంలో మంచు మనోజ్ కరోనా బారిన పడ్డారు. ఆరోగ్యం బాగానే ఉన్నా, కొవిడ్ టెస్టు చేయించుకున్నప్పుడు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.