మరోసారి గొప్ప మనసు చాటుకున్న మహేశ్‌బాబు

మహేశ్‌బాబు తన గొప్ప మనసుని మరోసారి చాటుకున్నాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 13 నెలల చిన్నారికి హార్ట్‌ ఆపరేషన్‌ చేయించేందుకు ముందుకొచ్చాడు.

  • Published By: veegamteam ,Published On : October 13, 2019 / 03:48 PM IST
మరోసారి గొప్ప మనసు చాటుకున్న మహేశ్‌బాబు

Updated On : October 13, 2019 / 3:48 PM IST

మహేశ్‌బాబు తన గొప్ప మనసుని మరోసారి చాటుకున్నాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 13 నెలల చిన్నారికి హార్ట్‌ ఆపరేషన్‌ చేయించేందుకు ముందుకొచ్చాడు.

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు బెజవాడలో సందడి చేశారు. ఎంజీ రోడ్డులో భీమా జ్యువెలరీ షోరూంను ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలి షోరూంను ఏర్పాటు చేసిన భీమ జ్యువెల్లర్స్‌కి మహేశ్‌ శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు మహేశ్‌బాబు. సంక్రాంతికి విడుదల కాబోతున్న తన కొత్త సినిమాను అందరూ ఆదరించాలని కోరారు. బెజవాడలో మహేశ్‌బాబుకు ఫ్యాన్స్‌ నుంచి ఘన స్వాగతం లభించింది. 

మరోవైపు మహేశ్‌బాబు తన గొప్ప మనసుని మరోసారి చాటుకున్నాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 13 నెలల చిన్నారికి హార్ట్‌ ఆపరేషన్‌ చేయించేందుకు ముందుకొచ్చాడు. టెక్కలికి చెందిన సందీప్‌ అనే చిన్నారి గుండెకు రంధ్రాలుండటంతో… చికిత్స చేయించేందుకు లక్షల రూపాయలు అవసరమవుతుందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా మహేశ్‌బాబు సేవా సమితి అధ్యక్షుడు… విషయాన్ని సూపర్‌స్టార్‌ దృష్టికి తీసుకెళ్లాడు. 

దీంతో చలించిన మహేశ్‌… చిన్నారికి చికిత్సకయ్యే ఖర్చును భరిస్తానని హామీ ఇచ్చాడు. ప్రస్తుతం విజయవాడలోని ఆంధ్ర ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న బాబు తల్లిదండ్రులతో మాట్లాడిన మహేశ్‌… వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చాడు